- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జలుబు, గొంతునొప్పి, దగ్గు సమస్యలతో బాధపడుతున్నారా.. తక్షణ ఉపశమనానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే?
దిశ, ఫీచర్స్: చలికాలం వచ్చిందంటే చాలు ఆసుపత్రుల్లో జనాలు క్యూ కడతారు. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ కారణంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి రోగాలు తలెత్తుతాయి. దీంతో జ్వరం సోకుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలుంటాయి. దీంతో ప్రజలు వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యుల్ని సంప్రదిస్తారు. డాక్టర్లు ఇచ్చే టాబ్లెట్స్‌ను వాడుతారు. అయితే హాస్పిటల్‌కు వెళ్లి.. డబ్బుతో పాటు సమయాన్ని వృథా చేసుకునే బదులు, హోం రెమెడీస్‌ను ప్రయత్నించడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంట్లోనే ఈ సులభమైన చిట్కాలను పాటించడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
* గొంతు నొప్పి నివారణ
గొంతు నొప్పి ఎక్కడున్నా అసౌకర్యానికి గురి చేస్తుంది. గొంతులో నొప్పి, దురద వస్తే ఫుడ్ తినడానికి గానూ, వాటర్ తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ప్రబ్లమ్ కొంతమందికి వాతావరణంతో కూడినదైతే.. మరికొంతమందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల తలెత్తవచ్చు. కాగా ఈ తీవ్రమైన గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలగాలంటే ఈ గృహ నివారణ చిట్కాలు పాటించాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ ఉప్పు కలిపి, ఆ వాటర్‌ను నోట్లో పోసుకుని 2 నిమిషాల వరకు పుక్కిలించండి. ఈ విధంగా సాల్ట్ వాటర్‌తో రోజుకు రెండు సార్లు చేస్తే గొంతును ఇబ్బంది పెట్టే క్రిములు నశిస్తాయి.
2. అలాగే గోరు వెచ్చని వాటర్‌లో అల్లం అండ్ నిమ్మకాయ రసం మిక్స్ తాగాలి.
3. దాల్చిన చెక్కను చప్పరించండి.
4. గొంతు నొప్పి ఉన్న సమయాల్లో కూరలలో వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగించండి.
5. ఆవిరి స్నానం చేయండి.
* జలుబు నివారణ చిట్కాలు
ఒకరి నుంచి మరొకరికి ఈజీగా వ్యాపించే వ్యాధి జలుబు. కోల్డ్‌తో సఫర్ అయ్యేవారు చాలా మంది ఉంటారు. కొంతమందికైతే స్వీట్ తిన్నా,కూల్ డ్రింక్స్ తాగినా, డస్ట్ ప్రదేశంలో ఉన్నా వెంటనే తుమ్ములు వస్తాయి. పైగా ఇది చలికాలం అస్తమా, సైనస్ వ్యాధి ఉన్నవారికి బెస్ట్ ఫ్రెండ్‌లా వారి వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాగా వెంటనే జలుబును తగ్గించుకునేందుకు మన ఇంట్లోనే చిన్న చిట్కాలను పాటిస్తే చాలు తొందరగా జలుబు నుంచి ఉపశమనం పొందొచ్చు. చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1 . జలుబు సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, అర టీ స్పూన్ మిరియాల పొడి కలిపి తాగండి. కోల్డ్ తొందరగా తగ్గుతుంది. పసుపులోని కర్కుమిన్‌కు బ్యాక్టీరియాను చంపే సామర్థ్యం ఉంటుంది. అలాగే మిరియాల పొడిలోని గుణాలు శ్లేష్మాన్ని కరిగించి బయటకు పంపుతాయి.
2. 5 తులసి ఆకుల కషాయాన్ని మరిగించి టీ లాగా చేసుకుని తాగితే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
3. 8 కరివేపాకు ఆకుల్ని మిర్యాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలకు చెక్ పెట్టొచ్చు.
4. కోల్డ్ ఉన్నప్పుడు అల్లం టీ తాగితే రిలీఫ్ ఉంటుంది.
5. లవంగాలు, తమలపాకు రసం, అల్లం రసాన్ని తేనెతో మిక్స్ చేసుకుని తాగితే వెంటనే జలుబు తగ్గుతుంది.
* దగ్గు నివారణ చిట్కాలు
దగ్గినప్పుడు ఊపిరితిత్తుల నుంచి నొప్పి వస్తుంది. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న వారు కొన్ని సార్లు వాంతులు కూడా చేసుకుంటారు. పదే పదే అదే పనిగా దగ్గుతూ ఉంటే పక్కన ఉన్నవారు కూడా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. కాగా దగ్గు నుంచి త్వరగా కోలుకోవాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి.
1. గ్లాస్ పాలల్లో అల్లం వెల్లుల్లి వేసి మరిగించండి. అనంతరం ఈ పాలలో కాస్త పసుపు వేసి తాగితే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
2. విపరీతమైన దగ్గుతో బాధపడుతున్నట్లైతే వాటర్‌లో రెండు చెంచాల తిప్పతీగ రసాన్నికలిపి తాగండి. ఇది ఇమ్యూనిటీ పవర్‌ను కూడా పెంచుతుంది.
3. దగ్గు ను నయం చేసే వాటిలో పచ్చి తేనె ఒకటి. గోరు వెచ్చని నీటిలో తేనెను కలిపి తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. చికాకు కూడా తగ్గుతుంది.
4. పుదీనా ఆకులను నీటిలో మరిగించి తాగితే గొంతు నొప్పితో పాటు తిమ్మిరి సమస్యలను కూడా తరిమికొడుతుంది.