- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విపరీతమైన ఆకలి వేధిస్తోందా? .. రక్తంలో గ్లూకోజ్ పెరగడంవల్ల కావచ్చు
దిశ, ఫీచర్స్ : కొందరికి తిన్న కాసేపటికే మళ్లీ ఆకలి వేస్తూ ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఇలా తిని అలా బయటకు వెళ్లిరాగానే మళ్లీ తినాలనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఒళ్లు చెమటలు పట్టడం, గుండె దడగా అనిపించడం, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. నాలుగైదు రోజులు గనుక కంటిన్యూ ఈ లక్షణాలు కనిపిస్తే టైప్ 2 డయాబెటిస్‌గా అనుమానించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగడంవల్ల కూడా ఇటువంటి సింప్టమ్స్ కనిపిస్తుంటాయని చెప్తున్నారు. వాస్తవానికి టైప్ 2 డయాబెటిస్ ఒక జీవక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. బాధితుల్లో గ్లూకోజ్ లేదా బ్లడ్ షుగర్ లెవల్స్‌లో హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి. బాడీ ఇన్సులిన్‌ను సరిగ్గా యూజ్ చేసుకోలేనప్పుడు ఈ పరిస్థితికి దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే అది మూత్రపిండాలు, గుండె వైఫల్యం వంటి సమస్యలకు దారితీయవచ్చు.
ఎలా గుర్తించాలి?
బ్లడ్‌లో షుగర్ లేదా గ్లూకోజ్ లెవల్స్ పెరిగినా తగ్గినా కొన్ని సింప్టమ్స్ కనిపిస్తుంటాయి. పెరిగినప్పుడు అధికంగా దాహం వేస్తూ ఉంటుంది. ఐదారు గ్లాసుల నీళ్లుతాగినా ఇంకా దాహం తీరని ఫీలింగ్‌ను బాధితులు అనుభవిస్తుంటారు. తరచుగా యూరిన్‌కు వెళ్లాలనిపిస్తుంది. గ్లూకోజ్ లెవల్స్ క్రాష్ అయ్యే క్రమంలో గుండె వేగంగా కొట్టుకోవడం, కాళ్లు, చేతులు చెమటలు పట్టడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు దేనిపైనా సరిగ్గా దృష్టిపెట్టలేకపోవడం, గందరగోళం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు బ్రెయిన్‌లోని న్యూరాన్స్ మధ్య సిగ్నలింగ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడంవల్ల ఇలా జరగుతుంది. ఇక మహిళల్లో అయితే బ్లడ్ షుగర్ పెరగడంవల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తి అయి తలపై వెంట్రుకలు రాలడం, ముఖంపై వెంట్రుకలు పెరగడం వంటి సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ఇటువంటి సమస్యలను మీరు ఎదుర్కొ్ంటున్నట్లయితే వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read more : విపరీతంగా గురక పెడుతున్నారా... మానాలంటే ఇలా చేయండి