ALCOHOL: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఆఫీసులో మందుకొట్టడం కూడా జాబే...

by Sujitha Rachapalli |
ALCOHOL: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఆఫీసులో మందుకొట్టడం కూడా జాబే...
X

దిశ, ఫీచర్స్ : మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే అవగాహన కార్యక్రమాలు చాలా దేశాల్లో కనిపిస్తాయి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కలిగే రోగాల గురించి కూడా గతంలో కన్నా ఎక్కువ అవేర్నెస్ పెరిగింది. ముఖ్యంగా గుడి, బడి, కార్యాలయాలు ఉన్న దరిదాపుల్లోకి కూడా వీటిని అనుమతించరు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. ముఖ్యంగా జపాన్ లో తాగకపోతేనే తప్పుగా భావించే సందర్భాలున్నాయి. ఇంతకీ స్టోరీ ఏంటంటే ..

ఈ దేశంలో క్లైంట్స్, కొలిగ్స్ తో మద్యం సేవించడం కంపెనీకి విధేయుడుగా ఉన్నట్లు పరిగణించబడుతుంది. ఉద్యోగంలో భాగంగానే ట్రీట్ చేయబడుతుంది. బాస్ ఆఫర్ చేసినప్పుడు వద్దంటే అవమానించినట్లు మాత్రమే కాదు జాబ్ పై కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఈ పద్ధతిని ' నోమికై ' అని పిలుస్తుండగా.. ఆఫీసు డే పొడగింపు, ఉద్యోగుల మధ్య సంబంధాలు పెంచేందుకు, టీం ఎఫర్ట్స్ పెంచేందుకు, కంపెనీ పట్ల కృతజ్ఞతతో ఉండేందుకు ఇలా చేయబడుతుంది. కానీ మితిమీరిన మద్యపానం సేవించడం, పదమూడు గంటల పని దినాల విషయంలో కాస్త వ్యతిరేకత ఉన్నా.. ఈ సంప్రదాయం జపనీస్ వ్యాపార సంస్కృతిలో ఒక ముఖ్యమైన అంశంగామిగిలిపోయింది.

Advertisement

Next Story

Most Viewed