భయపడుతున్న లవర్స్.. ఆ పని చేయాలా.. వద్దా..? పాస్ట్ రిలేషన్స్ గాయాలే కారణమా..?

by Dishaweb |   ( Updated:2023-07-06 16:37:05.0  )
భయపడుతున్న లవర్స్.. ఆ పని చేయాలా.. వద్దా..? పాస్ట్ రిలేషన్స్ గాయాలే కారణమా..?
X

దిశ, ఫీచర్స్: సింగిల్స్ ఎప్పుడూ మింగిల్ అవడానికే ట్రై చేస్తారు. నచ్చిన అమ్మాయి/ అబ్బాయిని లవ్‌లోకి దింపేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ప్రేమలో పడేందుకు భయపడుతుంటారు. దీన్నే ‘ఫిలోఫోబియా’ అని పిలుస్తుండగా.. ఈ భయం లవ్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయకుండా ఆపేస్తుంది. ఇలాంటి పరిస్థితి పాస్ట్ రిలేషన్‌షిప్స్‌లో గాయపడిన లేదా మోసపోయిన వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది. మరోసారి తిరస్కరించబడతామేమో, వదిలేయబడతామేమో అనే భయం వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఫిలోఫోబియా’ను ఎలా ఎదుర్కోవాలి? ప్రేమలో పడే భయాన్ని ఎలా అధిగమించాలి? తెలుసుకుందాం.

ఫిలోఫోబియా సాధారణమా?

ఫిలోఫోబియాను ఎక్స్‌పీరియన్స్ చేయడం సాధారణమే అంటున్నారు నిపుణులు. ఇది స్వయంగా గుర్తించదగిన మానసిక రుగ్మతగా వర్గీకరించబడనప్పటికీ.. వ్యక్తి మానసిక శ్రేయస్సు, సంబంధాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అయితే లక్షణాలు వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతాయని గుర్తించడం ముఖ్యం. ప్రత్యేకమైన అనుభవాలు, దృక్కోణాలు ప్రేమ, సంబంధాల పట్ల వారి ప్రతిచర్యలు భిన్నంగా ఉండవచ్చు. కొంతమంది పర్సన్స్ తమ వ్యక్తిగత అనుభవాలు, నమ్మకాలు లేదా స్వభావాన్ని బట్టి ప్రేమలో పడటం పట్ల సహజంగానే మరింత జాగ్రత్తగా, భయపడి ఉండవచ్చు. కానీ లవ్‌లో పడతామనే భయం ఎక్కువైపోయి.. ఒక వ్యక్తి రోజువారీ పనితీరును దెబ్బతీసినప్పుడు ప్రొఫెషనల్ సపోర్ట్ పొందడం బెటర్.


ఎలా ఓవర్‌కమ్ చేయాలి?

1. సెల్ఫ్ రిఫ్లెక్షన్

మీ భయాన్ని, దానికి గల కారణాలను అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. ప్రేమలో పడతామనే భయానికి దోహదపడే గత అనుభవాలు, నమ్మకాలు, ప్రతికూల ఆలోచనా విధానాలను అన్వేషించండి. సెల్ఫ్ అవేర్‌నెస్‌ పెంచుకుంటూ.. మీలోని భయాలకు సొల్యూషన్ వెతకండి.

2. చాలెంజ్ నెగెటివ్ బిలీఫ్స్

లవ్, రిలేషన్‌షిప్స్ గురించి మీరు కలిగి ఉన్న ప్రతికూల నమ్మకాలను గుర్తించండి. వాటిని సవాల్ చేయండి. వీటిని మరింత పాజిటివ్, రియలిస్టిక్ థాట్స్‌తో రీప్లేస్ చేయండి. నెగెటివ్ థాట్స్‌ నుంచి బయటపడేందుకు కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ పద్ధతులు ప్రభావవంతంగా పనిచేస్తాయి.

3. గ్రాడ్యువల్ ఎక్స్‌పోజ్

ప్రేమ, సంబంధాలతో కూడిన పరిస్థితులకు క్రమంగా మిమ్మల్ని మీరు ఎక్స్‌పోజ్ చేయండి. తక్కువ-రిస్క్‌తో కూడిన సోషల్ ఇంటరాక్షన్స్‌తో ప్రారంభించి, క్రమంగా మరింత ఇంటిమేట్ కనెక్షన్స్ వైపు వెళ్లండి. ఇలా చేయడం వల్ల మీలో ఇతరుల పట్ల నమ్మకం పెరిగి, లవ్ అనే భయాన్ని సవాల్ చేయడానికి అనుమతిస్తుంది.

4. మైండ్‌ఫుల్‌నెస్, రిలాక్సేషన్ టెక్నిక్స్

ఆందోళనను కంట్రోల్ చేసేందుకు, స్థిరంగా ఉండేందుకు మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ లేదా రిలాక్సేషన్ ఎక్సర్‌సైజ్ ప్రాక్టీస్ చేయండి. ఈ పద్ధతులు ప్రేమలో పడే భయంతో ముడిపడి ఉన్న అధిక ఆలోచనలు, భావోద్వేగాలను తగ్గించడంలో సహాయపడతాయి.

5. గత బాధలను పరిష్కరించండి

ప్రేమలో పడాలనే మీ భయానికి గత బాధలు, సమస్యలతో ఏదైనా సంబంధం ఉన్నట్లయితే.. ఈ అనుభవాలను పరిష్కరించడానికి, నయం చేయడానికి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. పాస్ట్ రిలేషన్స్‌లో ఎదుర్కొన్న ఎమోషనల్ పెయిన్‌ను ప్రాసెస్ చేయడానికి, రిలీజ్ చేయడానికి థెరపీ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.

6. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్‌పై దృష్టి పెట్టండి

మీ శ్రేయస్సు, ఆత్మగౌరవాన్ని పెంపొందించే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వండి. నచ్చిన హాబీలలో పాల్గొనండి. మీ పట్ల మీరు దయగా ఉండటం అలవాటు చేసుకోండి. మీతో సానుకూల సంబంధాన్ని పెంచుకోండి. సెల్ఫ్ లవ్ అనే బలమైన పునాదిని నిర్మించడం ఇతరుల ప్రేమను పొందడాన్ని సులభతరం చేస్తుంది.

7. వాస్తవిక అంచనాలను సెట్ చేయండి

ఏ రిలేషన్ పర్ఫెక్ట్ కాదని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరిలో లోపాలు, సవాళ్లు ఉంటాయని గుర్తించండి. లవ్ అండ్ రిలేషన్‌షిప్ కోసం వాస్తవిక అంచనాలను సెట్ చేయండి. ప్రేమలో ఉండే ఇద్దరు భాగస్వాముల నుంచి కాంప్రమైజ్, ఎఫర్ట్ ముఖ్యమని అంగీకరించండి.

Advertisement

Next Story