రాక్ సాల్ట్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

by Anjali |   ( Updated:2023-03-26 13:54:29.0  )
రాక్ సాల్ట్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు
X

దిశ, ఫీచర్స్: పూర్వకాలంలో శక్తి కోసం చాలామంది రాతి ఉప్పు(రాక్ సాల్ట్)ను వినియోగించేవారు. అందుకే మన తాతలు, అమ్మమ్మలు అంత ఎనర్జీతో ఉంటారు. కానీ ఈ కాలం వారు కల్తీ ఉప్పును వాడుతూ రోగాల పాలవుతున్నారు. ఈ రాతి ఉప్పులో ఎలాంటి కల్తీ లేని స్వచ్ఛమైనది కాగా సముద్రం లేదా సరస్సు నుంచి ఉప్పు నీరు ఆవిరైన తర్వాత సోడియం క్లోరైడ్ గులాబీ రంగు స్ఫటికాలు వదిలేసినప్పుడు ఈ సేంద నమక్ ఏర్పడుతుంది. ఇందులో ఐరన్, జింక్, నికెల్, మాంగనీస్ వంటి శరీరానికి మేలు చేసే ఖనిజాలు ఉంటాయి. అయితే దీని వల్ల ఎలాంటి లాభాలు, నష్టాలు ఉన్నాయో చూద్దాం.

లాభాలు :

1. రక్తపోటును నియంత్రించడంలో రాతి ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉండే ఈ ఉప్పును తీసుకోవడం వల్ల త్వరగా అలసిపోయేవారి శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.

2. రాతి ఉప్పు కళ్లకు చాలా మేలు చేస్తుంది. దీని మూలంగా దృష్టి నష్టాన్ని నివారిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను ఆరోగ్యవంతంగా మార్చడంలో కూడా ఈ రాక్ సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది.

3. కొంత మందికి ప్రయాణాలు అంతగా పడవు. వాంతులు లేదా వికారంగా ఉంటుంది. అలాంటప్పుడు, రాళ్ల ఉప్పులో నిమ్మరసం కలిపి తాగితే మంచి ఉపశమనం ఉంటుంది.

4. ఇక పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో సేంద నమక్‌ను బాగా ఉపయోగిస్తున్నారు. దీంతో దగ్గు, జలుబు వంటి రోగాలు సైతం తగ్గించవచ్చు.

5. ఇది కండరాల తిమ్మిర్లు రాకుండా అలాగే శరీరంలోని నరాలను సరైన తీరులో పని చేసేలా సహాయపడుతుంది.

నష్టాలు :

1. ఎక్కువగా ఆహారంలో రాతి ఉప్పును మాత్రమే వాడటం మూలంగా శరీరంలో నీరు నిలుపుదల సమస్య ఉంటుంది. దీంతో శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.

2. సాధారణ ఉప్పు కంటే రాతి ఉప్పులో అయోడిన్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువగా ఆహారంలో రాతి ఉప్పును మాత్రమే ఉపయోగిస్తే, అది అయోడిన్ లోపానికి కారణమై అనేక వ్యాధులకు దారితీస్తుంది.

3. రాతి ఉప్పు అధికంగా వాడినట్లయితే శరీరంలో అలసట, కండరాల బలహీనతను కలిగిస్తుంది. కాబట్టి దీని పరిమాణంలో మాత్రమే తినాలి.

4. సాధారణంగా రాక్ సాల్ట్ రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగిస్తారు. కానీ ఎక్కువగా తినడం వల్ల కూడా అధిక రక్తపోటు వస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

5. ఇక థైరాయిడ్ ఉన్నవారికి, రాళ్ల ఉప్పు చాలా హానికరం.

Advertisement

Next Story

Most Viewed