2-2-2 Rule : బరువు తగ్గాలని అనుకుంటున్నారా? మోస్ట్ ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తున్న పద్ధతి..

by Sujitha Rachapalli |
2-2-2 Rule : బరువు తగ్గాలని అనుకుంటున్నారా? మోస్ట్ ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తున్న పద్ధతి..
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం అధిక బరువుతో బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హార్ట్ డిసీజ్ తో పాటు దీర్ఘకాలిక రోగాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో తప్పకుండా బరువు తగ్గాల్సి వస్తుంది. కాబట్టి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. అయితే ప్రస్తుతం 2-2-2 రూల్ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది. అమెరికాకు చెందిన వెయిట్ లాస్ కోచ్ ఈ పద్ధతి ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చని.. తాను చక్కటి రిజల్ట్ పొందానని చెప్తుండగా.. అసలు ఈ రూల్ ఏంటి? ఎంత వరకు ఎఫెక్టివ్ గా ఉంటుంది? తెలుసుకుందాం.

అసలు ఏం చేయాలి?

రోజూ రెండు పండ్లు: 2-2-2 రూల్ లో భాగంగా రోజుకు రెండు పండ్లు తీసుకోవాలి. ఆపిల్, ఆరెంజ్, బెర్రీస్ ఇలా.. విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండే పండ్లను ఎంచుకోవాలి. BMC పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన 2014 అధ్యయనం ప్రకారం పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం.. తక్కువ శరీర బరువు, తగ్గిన బరువు పెరగడం మధ్య లింక్ ఉంది.

రోజూ రెండు కూరగాయలు : కూరగాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఆహారంలో బచ్చలికూర, బ్రోకలీ, క్యారెట్ వంటి కూరగాయలను తీసుకోవడం మంచిది.

రోజూ రెండు లీటర్ల నీరు : హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. పూర్తి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి భోజనానికి ముందు నీరు త్రాగాలనే నియమాన్ని ఫాలో అవండి. దీనివల్ల సగం ఆకలి తీరుతుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీలో ప్రచురితమైన 2013 అధ్యయనం ప్రకారం ... చక్కెర-తీపి పానీయాలు లేదా పండ్ల రసాల స్థానంలో ఎక్కువ నీరు త్రాగడం వల్ల తక్కువ బరువు పెరుగుతారు.

రోజూ రెండుసార్లు వాకింగ్ : రోజూ రెండు సార్లు వాకింగ్ చేయడం వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. జీవక్రియను పెంచుతుంది. కేలరీలు బర్నింగ్‌కు దోహదం చేస్తుంది. 2022లో న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధనలో ... నెమ్మదిగా లేదా వేగంగా నడవడం ద్వారా శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుందని గుర్తించింది.

ప్రభావవంతంగా ఉంటుందా?

ఈ వైరల్ పద్ధతిని అనుసరించడం వల్ల చాలా లాభాలున్నాయి. ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోవడంతో.. వీటిలో రిచ్ ఫైబర్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి, బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉండి .. మంటను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు. జీరో కేలరీలు ఉన్నప్పటికీ నీరు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. శక్తివంతంగా ఉంచుతుంది. వ్యాయామం చేయడం వల్ల కేలరీలు బర్న్ అవ్వడమే కాకుండా, గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ నిర్వహించడంలో సహాయపడుతుంది.

కాగా ఎంత కాలం ఈ పద్ధతి ఫాలో కావాలనేదు వారి ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉండొచ్చు. అయితే మొబిలిటీ ఇష్యూస్, దీర్ఘకాలిక వ్యాధులు, డైటరీ రిస్ట్రక్షన్ ఉన్నవారు ఈ వెయిట్ లాస్ మెథడ్ ఫాలో కాకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఫాలో అయ్యే ముందు డాక్టర్స్ సజెషన్ తీసుకోవాలని చెప్తున్నారు.



Next Story