సమస్యను త్వరగా పరిష్కరించాలా?.. తెలివైన వ్యక్తులకు అంత ఈజీ కాదు, ఎందుకంటే..

by samatah |   ( Updated:2023-08-03 06:43:16.0  )
సమస్యను త్వరగా పరిష్కరించాలా?.. తెలివైన వ్యక్తులకు అంత ఈజీ కాదు, ఎందుకంటే..
X

దిశ, ఫీచర్స్ : తెలివైన వ్యక్తులు ఫాస్ట్‌గా ఆలోచిస్తారని, ఏ సమస్యకైనా వారివద్ద సత్వర పరిష్కారం ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదంటున్నారు జర్మన్ అండ్ స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు. అధిక ఐక్యూను కలిగిన వారు సాధారణ పనుల విషయంలో మాత్రమే ఫాస్ట్‌గా వ్యవహరిస్తుంటారని చెప్తున్నారు. తక్కువ ఐక్యూ (IQ) కలిగి ఉన్న వ్యక్తులతో పోలిస్తే వీరు కష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం తీసుకుంటారట. మెదడులోని డిఫరెంట్ ఏరియాల మధ్య సంభవించే కొన్ని మార్పులే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.

స్టడీలో భాగంగా రీసెర్చర్స్ 650 మంది వ్యక్తుల బ్రెయిన్ స్కాన్‌లకు సంబంధించిన డిజిటల్ డేటాను ఎనలైజ్ చేశారు. మెదడు అనుకరణలను పరిశీలించడానికి బయాలాజికల్ ప్రాసెస్ ఆధారంగా మాథమెటికల్ మాడల్స్‌తో కలిపి అబ్జర్వ్ చేశారు. ఈ సందర్భంగా నిపుణులు మెదడు సామర్థ్యాలను, IQ స్కోర్‌లను అంచనా వేశారు. అయితే నాడీ ఉత్తేజం, నిరోధానికి సంబంధించిన సమతుల్యత సమస్య పరిష్కార సామర్థ్యాలను ప్రభావితం చేయడం మూలంగా అధిక ఐక్యూగల వ్యక్తులు ఒక సమస్య పరిష్కారానికి ఎక్కువ సమయం తీసుకుంటారని గుర్తించారు. మెదడులోని సింక్రొనైజేషన్ ఫ్రంటల్ లోబ్‌లోని న్యూరల్ సర్క్యూట్‌లు తెలివైన వ్యక్తుల్లో ఈ విధమైన డెసీషన్స్ తీసుకోవడంలో కీలక‌పాత్ర పోషిస్తాయని బెర్లిన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన న్యూరాలజీ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ పెట్రా రిట్టర్ తెలిపారు.

Read More: పెద్ద వయసు ఉన్న మహిళతో మైనర్ సహజీవనం చట్టబద్ధం కాదు

Advertisement

Next Story

Most Viewed