శాకాహారం పర్యావరణ నష్టాన్ని భారీగా తగ్గిస్తుంది.. అధ్యయనంలో వెల్లడి

by Prasanna |   ( Updated:2023-07-21 06:18:24.0  )
శాకాహారం పర్యావరణ నష్టాన్ని భారీగా తగ్గిస్తుంది.. అధ్యయనంలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్ : డైలీ 100 గ్రాముల మాంసాన్ని కలిగి ఉన్న ఆహారంతో పోలిస్తే, శాకాహారంతో కూడిన ఆహారపు అలవాట్లు ఎన్విరాన్ మెంటల్ డ్యామేజ్‌ను భారీగా తగ్గించడంలో సహాయపడతాయని ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ విధానం క్లైమేట్ హీటింగ్ ఎమిషన్స్ ఉద్గారాలు, వాటర్ పొల్యూషన్, భూ వినియోగంలో తగ్గుదలకు దారితీసినట్లు పేర్కొన్నది. అంతే కాకుండా శాకాహారం తీసుకోవడం వల్ల వన్యప్రాణుల విధ్వంసం 66 శాతం, నీటి వినియోగం 54 శాతం తగ్గినట్లు స్పష్టం చేసింది.

ఆహారపు అలవాట్లు, పర్యావరణంపై ఎఫెక్ట్ గురించి తెలుసుకోవడానికి యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 55 వేలమంది వ్యక్తుల నిజమైన ఆహారపు అలవాట్లు, అలాగే 119 దేశాల్లోని 38 వేలఫారమ్‌ల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించారు. ‘‘ఆహార ఎంపికలు కూడా ప్లానెట్‌పై ఇంపాక్ట్ చూపుతాయి. ఆహారంలో మాంసం, పాడి పదార్థాల పరిమాణాన్ని తగ్గించడం వల్ల పర్యావరణంలో పెద్ద సానుకూల మార్పు వస్తుంది” అని ప్రధాన పరిశోధకుడు, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పీటర్ స్కార్‌బరో అంటున్నారు. రోజూ వంద గ్రాముల మాంసాన్ని కలిగి ఉన్న ఆహారంతో పోలిస్తే, శాకాహారం తీసుకునే అవాటుతో వాతావరణ తాపన ఉద్గారాలు, నీటి కాలుష్యం, భూ వినియోగం 75 శాతం తగ్గినట్లు తమ పరిశోధన నిరూపించినట్లు స్కార్‌బరో పేర్కొన్నాడు.

Read More: వర్షాలతో వైరల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు.. నివారణకోసం ఇలా చేయండి

Advertisement

Next Story

Most Viewed