- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడపిల్లలున్న తండ్రులు అదృష్టవంతులు.. ఎక్కువ కాలం జీవిస్తారట !
దిశ, ఫీచర్స్: కొందరు మగసంతానం లేకపోవడం దురదృష్టం అనే అపోహను కలిగి ఉంటారు. కానీ తాజా అధ్యయనం మాత్రం ఆడపిల్లలు లేని తండ్రులు దురదృష్టులు కావచ్చు అంటోంది. ఎందుకంటే కుమార్తెలను కలిగి ఉండే తండ్రులు, కుమార్తెలు లేని వారితో పోల్చితే ఎక్కువకాలం జీవిస్తారని పరిశోధకులు కనుగొన్నారు. ప్రతీ డాటర్ వల్ల ఆమె ఫాదర్ చాలా సంతోషంగా ఉంటాడని, దీనివల్ల అతని జీవితకాలం సుమారు 74 వారాలకంటే ఎక్కువగా పెరుగుతుందని చెప్తున్నారు. ఇక అందుకు విరుద్ధంగా కుమార్తెలు, అలాగే కుమారులు ఇద్దరూ తల్లి ఆరోగ్యంపై కాస్త నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతారని, దీనివల్ల తల్లి జీవితకాలం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అయితే గత పరిశోధనలు జెండర్‌తో సంబంధం లేకుండా పేరెంట్‌హుడ్‌ని సూచిస్తున్నాయి. వాటి ప్రకారం పేరెంట్స్ ఇద్దరి జీవితకాలం పెరుగవచ్చు.
అధ్యయనంలో భాగంగా జాగిలోనియన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ 2,147 మంది తల్లులు, అలాగే 2,163 మంది తండ్రులు మొత్తం 4,310 మంది వ్యక్తుల సంతానంలో కుమార్తెలు, కుమారుల ప్రభావానికి సంబంధించిన డేటాను సేకరించి ఎనలైజ్ చేశారు. తండ్రుల దీర్ఘాయువుపై ప్రభావాలను గుర్తించేందుకు, కుమార్తెలు, కొడుకుల మధ్య తేడాను చూపుతూ పిల్లల సంఖ్యను అబ్జర్వ్ చేశారు. ఆసక్తికరంగా మొత్తం పిల్లల సంఖ్య లేదా కొడుకుల సంఖ్య తండ్రుల జీవితకాలంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపలేదని గుర్తించారు. అదే సందర్భంలో కేవలం కుమార్తెల సంఖ్య మాత్రమే తండ్రి దీర్ఘాయువుతో సంబంధం కలిగి ఉందని గమనించారు. పైగా డాటర్స్ ఉన్న తండ్రులు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారని, ఆనందంగా గడుపుతారని, ఎక్కువ కాలం జీవించడానికి ఇష్టపడతారని పరిశోధకులు అంటున్నారు. ఈ విధమైన జీవనశైలి తండ్రి ఆయుష్షును ‘74 వారాలు’ పొడిగిస్తుందని చెప్తున్నారు. అయితే గత అధ్యయనాలు జెండర్‌తో సంబంధం లేకుండా కేవలం సంతానంపై విశ్లేషించాయి. వాటి ప్రకారం సంతానం కలిగి తల్లిదండ్రులు, సంతానం లేనివారికంటే ఎక్కువకాలం సంతోషంగా జీవిస్తారని పేర్కొన్నాయి.