- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీట్ వేవ్ ఎఫెక్ట్.. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవారికి డెత్ రిస్క్ !
దిశ, ఫీచర్స్: స్కిజోఫ్రెనియా (schizophrenia) అనే మెంటల్ హెల్త్ హిస్టరీ ఉన్నవారు హీట్ వేవ్ లేదా వడదెబ్బ కారణంగా మృత్యువాత పడే అవకాశాలు సాధారణ వ్యక్తులతో పోల్చితే మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయని ఒక అధ్యయనం పేర్కొన్నది. మీరు వేసవిని ఇష్టపడితే పర్వాలేదు. కానీ దానితో భయపడే వారు, అలాగే మానసిక సమస్యలు ఉన్నవారు తీవ్రమైన వేడి వాతావరణ పరిస్థితులవల్ల తరచూ అనారోగ్యాలుకు గురవుతారని, మరణం కూడా సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. భౌతిక పరిస్థితులు, వాతావరణ ప్రభావాల గురించి మనకు తెలిసినప్పటికీ మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న లింక్ గురించి ఇప్పటి వరకు చాలా విషయాలు తెలియవు. అందుకే హీట్ రిలేటెడ్ డెత్ రిస్క్ గురించి తెలుసుకోవడానికి బ్రిటీష్ కొలంబియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (బిసిసిడిసి)కి చెందిన ఎపిడెమియాలజిస్టులు పరిశోధనలు చేశారు. 2021 జూన్‌లో పసిఫిక్ నార్త్ వెస్ట్‌లోని కొన్ని ప్రాంతాలను వేడెక్కించిన వెస్ట్రన్ హీట్ డోమ్ ఈవెంట్ ప్రభావాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు హీట్ రిలేటెడ్ డెత్ రిస్క్ కలిగి ఉన్నారని తెలుసుకున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ‘‘స్కిజోఫ్రెనియా అనేది వాస్తవికతను గ్రహించే విధానంలో, ప్రవర్తనలో గణనీయమైన బలహీనతలు కలిగి ఉంటుంది. ఇది ఒక వ్యక్తి తన చుట్టూ ఉండే పరిస్థితులు, వాతావరణం మూలంగా నిరంతరం భ్రమలు, లేదా భ్రాంతులకు గురయ్యేలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తుల్లో మరణం సంభవించే ప్రభావాలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయని అధ్యయనంలో పాల్గొన్న ఎపిడెమియాలజిస్టులు అంటున్నారు. సూర్యుడి వేడి తరంగాలు తల, భుజాలపై ప్రభావం చూపిన వారు అధికంగా మరణం సంభవించే వారి జాబితాలో ఉంటున్నారని పేర్కొన్నారు. అందుకే స్కిజోఫ్రెనియా సమస్యలు ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని, బాధితులకు వాతావరణ సంరక్షణ అవసరమని చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి: తల, మెడ క్యాన్సర్లకు సరికొత్త ట్రీట్‌మెంట్.. అందుబాటులోకి న్యూ రేడియేషన్ థెరపీ