- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్కడ ముట్టుకున్నా.. పట్టుకున్నా ఫైన్ కట్టాల్సిందే..! ఆ గ్రామ రాజ్యాంగం అదే?
దిశ, వెబ్‌డెస్క్ : మన దేశంలోని కొన్ని గ్రామాల్లో వింత ఆచారాలు ఉంటాయి. కొన్ని కొన్ని గ్రామాల్లో ఇతర గ్రామాలకు చెందిన పరాయి మనుషులను గ్రామంలో రానివ్వరు. మరి కొన్ని గ్రామాల్లో వేరే ఆచారాలు ఉంటాయి. అలాంటి ఒక వింత ఆచారం సిమ్లాలోని కులు జిల్లా మలానా గ్రామంలో ఉంది. ఈ ప్రాంతం టూరిజానికి పెట్టింది పేరు. ఇక్కడికి ఎంతో మంది టూరిస్టులు వస్తూపోతూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చిన వారు మాత్రం ఆ గ్రామాల్లో ఉండే నియమాలు తూచా తప్పకుండా పాటించాలి. ఈ నియమాల్లో ఓ నియమం చాలా వింతగా, విచిత్రంగా ఉంటుంది. ఈ నియమం గురించి తెలుసుకోకుండా ఎవరైనా గ్రామంలో అడుగుపెట్టారో ఇంక అంతే సంగతి అన్నమాట.
అయితే ఆ గ్రామంలో ఉండే నియమం ఏంటంటే అక్కడికి వెళ్లిన వారు ఎవరూ కూడా ఆ గ్రామంలో ఉండే ఏ వస్తువును కూడా ముట్టుకోకూడదు. అదే ఆ గ్రామంలో ఉండే వింత ఆచారం, నియమం. అంతే కాదు మాలానా గ్రామానికి వచ్చిన పర్యటకులు అక్కడి షాపుల్లో ఏదైనా వస్తువులను కొనుగోలు చేస్తే దుకాణదారుడు సరుకులను చేతికి ఇవ్వకుండా దుకాణం వెలుపల ఆ వస్తువులను ఉంచుతాడు. అయితే ఈ నియమం గురించి ఊరిబయట ఓ పెద్దబోర్డు పైన కూడా రాశారు. టూరిస్టులు గ్రామానికి వచ్చినపుడు ఏదైనా వస్తువును ముట్టుకుంటే రూ.1,000 నుండి రూ.2,500 వరకు జరిమానను విధిస్తారట. ఇక్కడున్న మరో ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామానికి సొంత రాజ్యాంగం కూడా ఉంది. రాజ్యాంగంలో పూర్వం రాసిన నియమాలనే ఇప్పటికీ అక్కడి ప్రజలు పాటిస్తున్నారు. మీరు కూడా ఎప్పుడైనా సరదాగా ఆ గ్రామానికి వెళితే జాగ్రత్త సుమా..
ఇవి కూడా చదవండి:
నిద్రలో కాదు మెళకువతో ఉన్నప్పుడే.. బ్రెయిన్ యాక్టవిటీపై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్