- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంట్లో మనిషి చనిపోతే మహిళ ఆ పార్ట్ కట్.. శవాన్ని పూర్తిగా కాల్చకుండా ఇంట్లోనే పందితో..
దిశ, వెబ్‌డెస్క్ : మన చుట్టూ వివిధ జాతుల, వర్గాల ప్రజలు జీవిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచంలోని అడవులలో నివసిస్తున్న అనేక గిరిజన తెగలు ఎన్నో సాంప్రదాయాలను, వింత ఆచారాలను పాటిస్తుంటారు. ఓ వైపు టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ కొన్ని తెగల ప్రజలు పూర్వం నుంచి వస్తున్న ఆచారాలనే నేటికీ పాటిస్తున్నారు. అలాంటి సాంప్రదాయాల గురించి విన్నా, చూసినా వింతగా అనిపిస్తుంటాయి. అలాంటి కొన్ని ఆచారాలలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండోనేషియాలోని పాపువా న్యూ గినియాలో నివసించే డానీ అనే తెగలో ఒక వింత ఆచారాన్ని పాటిస్తారు. ఈ ఆచారాలు చూస్తే ఒళ్లుగగురుపొడుస్తుంది. ఇంతటి దారుణమైన ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారా అని ఆశ్చర్యపోక తప్పదు. ఇలాంటి ఒక తెగ ఉందని 83 సంవత్సరాల క్రితం వరకూ ప్రపంచానికి తెలియదు. ఇంతకీ ఆ ఆచారం ఏంటి..? ఏమా కథ అంటే..
డానీ తెగకు చెందిన వారు ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి చెందిన స్త్రీ వేలుని కత్తిరిస్తారు. కుటుంబంలో ఎంత మంది చనిపోతే ఆ కుటుంబంలో ఉండే అందరి స్త్రీల వేలిని కత్తిరిస్తారు. అంటే ఒక మనిషి చనిపోతే ఒక వేలు కత్తిరిస్తారు.
అయితే ఇదే తెగలో మరో వింత ఆచారం కూడా ఉంది. ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులు శవాన్ని పూర్తిగా కాల్చరంట. మృతదేహం సగం కాలగానే దాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో అలంకరించుకుంటారట. ఆ తరువాత సగం కాలిన శవాల పై పంది కొవ్వును రాసి మమ్మీలుగా మార్చి ప్రత్యేక గుడిసెలో ఉంచుతారు. కొందరికి మాత్రమే ఈ గుడిసె లోపలికి అనుమతిస్తారు. అంతే కాదు పూర్వం ఈ జాతివారు మనుషుల శవాలను తిని జీవించేవారట.తలుచుకుంటేనే భయం గొలిపే ఈ ఆచారాలను నేటికీ అక్కడి తెగ శతాబ్ధాలుగా తూచ తప్పకుండా పాటిస్తుండటం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
మల్టిపుల్ సెక్స్ పార్టనర్స్‌ను కలిగి ఉంటున్న స్పానిష్ పీపుల్.. CIS సర్వేలో వెల్లడి