- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణభయంతో దొర్లుతున్న పాము..
దిశ, సినిమా : సాధారణంగా పాములు వేటాడే జంతువుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు బుసలు కొట్టడం లేదా వేగంగా పాకడం చేస్తుంటాయి. కానీ ఆగ్నేయాసియా అడవుల్లో ఉండే మరగుజ్జు రీడ్ పాములు (సూడోరాబ్డియోన్ లాంగిసెప్స్-Pseudorabdione longiceps).. దొర్లుతున్నట్లు గుర్తించారు మలేషియాకు చెందిన శాస్త్రవేత్తలు. ఆగస్టు 2019లో కేడాన్‌లో రీడ్ స్నేక్ రోడ్డు దాటుతున్నట్లు పరిశీలించిన వారు... దాన్ని సమీపించేసరికి దొర్లడం ప్రారంభించింది. మొదట S- ఆకారంలోకి ముడుచుకుని, దాని శరీరం ముందు భాగాన్ని నేల నుంచి పైకి లేపింది. దాని తోక నుంచి బయటకు నెట్టడంతో, పాము పూర్తిగా గాలిలో వ్యాపించింది. దాని తల నేలను తాకినట్లు అనిపించినప్పుడు, పాము వేగంగా కిందకి లాక్కుని వృత్తాకారంలో చుట్టుకుంది. అలా పూర్తి భ్రమణం చేయడంతో.. మళ్లీ నేల నుంచి నెట్టబడింది.
పాము ఐదు సెకన్లలో మీటరున్నర దూరం ప్రయాణించిందని, పాకడం కంటే వేగంగా కదిలిందని వీడియో సాక్ష్యాలు కూడా అందించారు శాస్త్రవేత్తలు. అయితే ఈ తప్పించుకునే పద్ధతికి చాలా శక్తి అవసరం కాబట్టి చాలా భయానకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా దొర్లుతున్నాయని అనుమానిస్తున్నారు. కానీ కేవలం ఈ పాము మాత్రమే ఇలా చేయగలుగుతుందా లేక ఇలాంటివేమైనా ఉన్నాయా అనే పరిశోధనలు జరగాల్సి ఉండగా.. 2023 సంవత్సరంలో కూడా సరీసృపాలలో కనుగొనడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయని తెలియడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.
ఇవి కూడా చదవండి: చంపడమే కాదు ప్రేమను పంచడంలోనూ ఆరితేరిన పులులు