phonepe : ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. ఇక ప్రతీ చెల్లింపు మరింత సులభం!

by Javid Pasha |   ( Updated:2025-03-13 06:45:14.0  )
phonepe : ఫోన్‌పేలో  కొత్త ఫీచర్.. ఇక ప్రతీ చెల్లింపు మరింత సులభం!
X

దిశ, ఫీచర్స్ : మీరు ఫోన్ పే యూజర్లా? అయితే ఇక ముందు వివిధ బిల్లుల చెల్లింపు, మొబైల్ రీచార్జ్‌ వంటివి చేయడం వెరీ సింపుల్‌! ఎందుకంటే ఈ డిజిటల్ పేమెంట్ సంస్థ తన వినియోగదారులకోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. అప్పటికప్పుడు మీ వద్ద క్రెడిట్ లేదా డెబిట్ కార్డు చేతిలో లేకపోయినా, వాటి పిన్, సివివి నంబర్లు తెలియకపోయినా పేమెంట్ చేయవచ్చు.

*ఈఎంఐ కట్టాలన్నా, కరెంట్ బిల్ పే చేయాలన్నా ఫోన్ పే (PhonePe) యూజర్లైతే ఏం చేస్తారు? గతంలో అయితే ముందుగానే మర్చంట్ ప్లాట్ ఫామ్‌లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను నమోదు చేసి, సేవ్ చేయాల్సి ఉండేది. ఇక నుంచి అలాంటి అవరం లేదు. ప్రతీ లావాదేవీ(transaction)కి సీవివి నంబర్‌ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదని ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే వెల్లడించింది. అందుకోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్‌(Device Tokenization Solution)ను ప్రారంభించింది. అంటే యూజర్లు ప్రస్తుతం ఫోన్ పే యాప్‌లో తమ కార్డులను టోకనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బిల్లుల చెల్లింపులోనైనా, ట్రైన్ లేదా ఫ్లైట్ టికెట్స్ బుకింగ్‌లోనైనా, బీమా కొనుగోళ్లలోనైనా ఇదే వర్తిస్తుంది.

*అయితే ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు మెరుగైన భద్రతతోపాటు సౌలభ్యం పొందే చాన్స్ ఉందంటున్నారు నిపుణులు. టోకనైజ్డ్ కార్డ్ వివరాలను ఫోన్ పేలో సేఫ్‌గా లింక్ చేయడం ద్వారా సైబర్ మోసాల రిస్క్ (Risk of cyber fraud) ఉండకపోవచ్చు. పైగా ఇది చెల్లింపులు, భద్రత విషయంలో యూజర్లకు భరోసా కల్పిస్తున్నది.

*కొత్త ఫీచర్ వల్ల అధిక లావాదేవీలు కొనసాగించే వ్యాపారులు కూడా బెనిఫిట్స్ పొందుతారు. ఎందుకంటే టోకనైజ్డ్ కార్డలు చాలా వేగవంతమైన లావాదేవీలను(transactions) అలో చేస్తాయి. ఎక్కువమంది యూజర్లు దీనిని వినియోగిస్తే.. దీనిని ఉపయోగించే వ్యాపారులకు కూడా పలు బెనిఫిట్స్ ఉంటాయని, డిజిటల్ చెల్లింపులకు భద్రత ఏర్పడుతుందని ఫోన్ పే యాజమాన్యం పేర్కొన్నది. అయితే ఈ సర్వీస్‌ను మరిన్ని కార్డ్ నెట్వర్కులకు విస్తరించాలని, ఫోన్ పే గేట్‌వే వ్యాపారులందరికీ వర్తింపజేస్తూ విస్తరించాలని ఫోన్ పే యాజమాన్యం భావిస్తున్నది.

Read More : వారానికోసారైనా స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్! ఎన్ని లాభాలో తెలుసా..?



Next Story

Most Viewed