- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ థియేటర్ లో రూ.600 తో 10 సినిమాలు చూడొచ్చు.. ఈ ఆఫర్ ఎప్పటివరకంటే
దిశ, ఫీచర్స్ : మీరు థియేటర్‌లో సినిమాలు చూడాలనుకుంటే ఈ శుభవార్త మీ కోసమే. భారతదేశంలోని అతిపెద్ద సినిమా PVR పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రోగ్రాం కింద రూ.600తో 10 సినిమాలు చూడొచ్చు. PVR పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్ 20 జనవరి 2024 నుండి ప్రారంభమై 31 మార్చి 2024 వరకు కొనసాగనుంది. ఈ ప్రోగ్రామ్ కింద, మీరు PVRలోని ఏ థియేటర్‌లోనైనా 2D, 3D లేదా IMAX సినిమాలను చూడవచ్చు. అయితే, ఈ ప్రయోజనం పొందడానికి మీరు ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి.
PVR పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్ కోసం ఇలా నమోదు చేసుకోవాలి..
ముందుగా PVR వెబ్‌సైట్ లేదా యాప్‌కి వెళ్లండి.
ఇప్పుడు ఇక్కడ "PVR పాస్‌పోర్ట్" పై క్లిక్ చేయండి.
దీని తర్వాత "రిజిస్టర్ నౌ" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
మీ వ్యక్తిగత వివరాలను పూరించండి.
తరువాత రూ. 600 చెల్లించండి.
మీ PVR పాస్‌పోర్ట్ ఇమెయిల్‌లో వస్తుంది.
PVR పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్ నిబంధనలు..
ఈ ప్రోగ్రామ్ ప్రకారం, మీరు ఒకే రోజులో రెండు సినిమాలు చూడటానికి వీలుండదు.
మీరు సినిమాని రెండుసార్లు చూడలేరు.
మీరు PVR సినిమా హాళ్లలో మాత్రమే సినిమాలు చూడవచ్చు.
PVR పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్.. ప్రయోజనాలు
PVR థియేటర్‌లలో టిక్కెట్‌లను కొనుగోలు చేసే సమయంలో పాస్‌పోర్ట్‌ను చూపించవలసి ఉంటుంది.
PVR పాస్‌పోర్ట్ ఉంటే టిక్కెట్ కు ఎటువంటి రుసుము చెల్లించవలసిన చేయనవసరం లేదు.
ప్రస్తుతం ఈ కార్యక్రమం కొన్ని నగరాల్లో మాత్రమే ప్రారంభించారు. పాస్‌పోర్ట్ కోసం నమోదు చేసుకునే ముందు, దయచేసి మీ నగరంలో ఈ ప్రోగ్రామ్ ప్రారంభం అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.