సంభోగం సమయంలో విచిత్రమైన శబ్దాలు.. ఆకర్షణ కోసమే..

by Nagaya |
సంభోగం సమయంలో విచిత్రమైన శబ్దాలు.. ఆకర్షణ కోసమే..
X

దిశ, ఫీచర్స్ : దక్షిణాఫ్రికాలోని అరణ్యాలలో కనిపించే కాపుచిన్‌బర్డ్ (capuchinbird) పక్షి జాతుల్లోకెల్లా అత్యంత అరుదైనదిగా, ఆసక్తికరమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే అది సంభోగ సమయంలో ఒక విధమైన పాట(కూత)తో అలరిస్తుంది. ఆ శబ్దం ఆవు ముక్కుద్వారా శ్వాస తీసుకుంటున్న వేళ వచ్చే సౌండ్ మాదిరిగా ఉంటుంది. వింతైన ఈ పక్షి లేత గోధమురంగు ఈకలతో విచిత్రమైన రూపాన్ని కలిగి ఉంటుంది. ఇవి బొడ్డుపై ప్రకాశవంతమైన ఆరేంజ్ కలర్, తలభాగం నీలిరంగు చర్మంతో కప్పబడి రాబందులాంటి తలను పోలి కలిగి ఉంటుంది. రూపం సంగతి ఏమోకానీ ఆ పక్షి సంభోగ సమయంలో పాడే వింతైనపాట (mating song) విన్నప్పుడు మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ పాట వింటుంటే దాని రూపాన్ని కూడా మరచిపోతారు. అలాగని ఆ పక్షి భాగస్వామితో సెక్స్ చేసే టైంలో దాని ముక్కు నుంచి వచ్చే శబ్దాలను ‘పాట’ అని పిలవడం అంటే అదేదో నైటింగేల్ లేదా మోకింగ్ బర్డ్‌లా శ్రావ్యమైన గొంతుతో పాడుతుందని కాదు, కానీ దాని సౌండ్ కొంచెం వింతగా ఉంటుంది.

ఒక విధంగా చెప్పాలంటే మేల్ కాపుచిన్‌బర్డ్ సంభోగ సమయంలో పాడే పాటను వర్ణించడం కొంచెం కష్టమైన పని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకమైన స్వరం లేదా ధ్వనిని కలిగి ఉంటుంది. అయితే కొందరు దానిని ఆవు ‘మూగింగ్‌‘తో పాటు ‘చైన్సా గిలక్కాయ’లతో పోల్చారు. కానీ ఇది కూడా పూర్తిగా కరెక్ట్ కాదని మరికొందరు పేర్కొంటున్నారు. అయితే దాని ‘మేటింగ్ సాంగ్’ను పోల్చడానికి అంతకంటే భిన్నంగా ఎవరూ ఆలోచించడం లేదు. బోవిన్ మూయింగ్‌తో పాట, దాని సారూప్యత కాపుచిన్‌బర్డ్‌కు ‘కాల్‌బర్డ్’ అనే నిక్ నేమ్‌ను తెచ్చిపెట్టింది.

మేటింగ్ సీజన్‌లో మేల్ కాపుచిన్‌బర్డ్స్ గుంపులు గుంపులుగా చేరి గంభీరమైన మేటింగ్ సాంగ్‌తో ఫిమేల్ కాపుచిన్ బర్డ్స్‌ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. అవి గాలిని పీల్చినప్పుడు మెడకు ఇరువైపులా ఉన్న ఎయిర్ బ్యాగ్ (air sacks)లో ఆ ఎయిర్‌ను స్టోర్ చేసుకునే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆ విధంగా ఫిమేల్ కాపుచిన్ బర్డ్స్‌తో సెక్స్ చేస్తున్నప్పుడు, లేదా అంతకుముందు వాటిని దగ్గరగా ఆకర్షించడానికి పిలిచే సంకేతాల కోసం శ్రావ్యమైన పాటలను ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. ఈ కాపుచిన్‌బర్డ్ మేటింగ్ సాంగ్ ఏవియన్(avian) ప్రపంచంలో అత్యంత అద్భుతమైన, బేసి గాత్రాలలో ఒకటిగా కొందరు పరిగణిస్తున్నారు.

Advertisement

Next Story