- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
World Sleep Day : కంటినిండా కునుకులేక అవస్థలు.. దేశంలో 59% మంది పరిస్థితి ఇదే..

దిశ, ఫీచర్స్ : మనిషి మంచిగుండాలంటే మనసు బాగుండాలి. మనసు బాగుండాలంటే కడుపు నిండా భోజనం, కంటినిండా కునుకు ఉండాలంటారు పెద్దలు. కానీ ఇప్పుడవన్నీ ఉన్నప్పటికీ రాత్రిళ్లు నిద్రపట్టని (Sleepless nights) వారు మన దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్నారని ఓ తాజా సర్వేలో వెల్లడైంది. కారణమేంటో తెలుసా? నిపుణుల ప్రకారం ఒక వ్యక్తి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. నైట్ షిప్టులు చేసేవారైతే పగలు, పగటిపూట వివిధ పనుల్లో నిమగ్నమయ్యేవారైతే రాత్రిళ్లు.. ఇలా ఏదో ఒక సమయంలో ఈ నాణ్యమైన నిద్ర సమయాన్ని కవర్ చేయాలి. కానీ చాలా మంది విషయంలో అది జరగడం లేదంటున్నారు నిపుణులు.
6 గంటలకంటే తక్కువే..
ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని (World Sleep Day marc - 14) పురస్కరించుకొని లోకల్ సర్కిల్(Local Circle Survey) అనే సంస్థ దేశ వ్యాప్తంగా 343 జిల్లాలల్లో 40 వేల మందిపై సర్వే నిర్వహించింది. ఇందులో 61 శాతం మంది పురుషులను, 50 శాతం మంది మహిళలను వారి నిద్ర అలవాట్ల గురించి ప్రశ్నించారు. కాగా ఈ సందర్భంగా మన దేశంలో 59 శాతం మంది రోజుకు కనీసం 6 గంటలు కూడా నిద్రపోవడం లేదని (59 % of people do not get at least 6 hours of sleep a day) సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు తేల్చారు. అందుకు కారణాలను పరిశీలిస్తే.. పట్టణాల్లో అయితే సెల్‌ఫోన్ వాడకం, గ్రామాల్లో దోమలు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.
రెండు శాతమే ప్రశాంతం
* దేశ జనాభాలో 6 నుంచి 8 గంటలు నిద్రపోతున్న వారి సంఖ్యను చూస్తే కేవలం 39 శాతమే ఉంటోంది. ఇది ప్రజల మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి(Mental and physical health condition)పై ప్రభావం చూపుతున్నట్టు నిపుణులు గుర్తించారు. అంతకాకుండా 4 నుంచి 6 గంటల నిద్రపోతున్న వారి శాతం కూడా దాదాపుగా 39 శాతమే ఉందని సర్వే పేర్కొన్నది.
* దేశంలోని కోట్లాదిమంది ప్రజలు నివసిస్తుంటే అందులో 2 శాతం మంది మాత్రమే కంటినిండా నిద్రపోతున్నారు(Only 2 % of people sleep with their eyes open). వీరు కూడా డైలీ 8 నుంచి 10 గంటలు నిద్రలోకి జారుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే.. దేశ జనాభాలో కనీసం 4 గంటలు నిద్రపోనివారు కూడా 20 శాతం మంది ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. కారణాలేమైనప్పటికీ 6 గంటలు కూడా నిద్రపోలేని వారి శాతం 60 శాతం ఉన్నట్టుగా నిపుణులు పేర్కొంటున్నారు.
కారణాలు ఇవే..
* చాలామంది కంటినిండా నిద్రపోకపోవడానికి గలకారణాలను కూడా సర్వే విశ్లేషించింది. అయితే పట్టణాల్లో ఉండేవారు ఆలస్యంగా తినడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఇక రాత్రిళ్లు సెల్‌ఫోన్ల వాడకంతోపాటు మానసిక ఒత్తిళ్లు(Psychological pressures), నైట్ డ్యూటీలు, శబ్ద, కాంతి కాలుష్యాలు(Noise and light pollution) కారణం అవుతున్నట్టు సర్వే పేర్కొన్నది.
* ఇక చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారిలో నిద్రలేమికి దోమల బెడద, ఇంట్లో పిల్లల అల్లరి, మానసిక ఒత్తిడి వంటివి కారణం అవుతున్నట్లు సర్వే పేర్కొన్నది. కారణాలేమైనా నిద్రలేమి పలు అనారోగ్యాలకు దారితీస్తుంది. తరచుగా నిద్రలేని పరిస్థితుల వల్ల డయాబెటిస్(Diabetes), స్ట్రోక్(Stroke), గుండె జబ్బులు(heart disease) వంటివి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే కనీసం 7 నుంచి 8 గంటలు క్వాలిటీ స్లీప్(Quality sleep)ఉండేలా జీవనశైలిని అలవర్చుకోవాలని, ఇది ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.
Also Read..
Viral video: ఇలాంటి వీడియోలు చూసినప్పుడే మానవత్వం ఇంకా బ్రతికే ఉందనిపిస్తుంది!