- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వర్క్ నుంచి డిస్‌కనెక్ట్ అవడం సాధ్యం కాదంటున్న మిలీనియల్స్.. ఎందుకో తెలుసా?
దిశ, ఫీచర్స్ : మిలీనియల్స్‌ను సాధారణంగా ‘ఆల్వేస్ ఆన్’ జనరేషన్‌గా పేర్కొంటారు. ఎందుకంటే వీరు తమ వర్క్ హవర్స్ తర్వాత కూడా ఇ మెయిల్స్ చెక్ చేయడం, రెస్టు తీసుకోవడానికి ముందు ఇన్‌బాక్స్‌ను క్లియర్ చేయడం, కార్యాలయంలో వివిధ పనులను పూర్తి చేయడం వంటివి చేస్తుంటారు. అవసరమైతే లంచ్‌టైమ్‌లో రిలీఫ్ అవ్వడాన్ని కూడా త్యాగం చేస్తుంటారని 2000 మందిపై నిర్వహించిన ఒక కొత్త సర్వే పేర్కొన్నది. దీని ప్రకారం ప్రతీ ముగ్గురు మిలీనియల్స్‌లో ఇద్దరు తమకు అన్‌ప్లగ్ చేయడం అసాధ్యమని భావిస్తున్నారు. పని ఒత్తిడి పెరగడం వల్ల కొందరు. అలాగే వర్కులో ఇంప్రూవ్‌మెంట్ కోసం ఇంకొందరు, ఫర్‌ఫెక్షన్ కోసం మరి కొందరు ఇలా చేస్తున్నారట. 1981 నుంచి 1996 మధ్య జన్మించిన (millennials) వారిలో 65 శాతం మంది తాము ‘ప్రతిరోజూ స్విచ్ ఆఫ్ చేయలేక చాలా వరకు పరధ్యానంలో మునిగిపోతుంటాం’’ అని నమ్ముతున్నారు. మరో 45 శాతం మంది మార్నింగ్ టైమ్‌లో తరచూ ఫోన్‌లను చెక్ చేస్తున్నారు.
మిలీనియల్స్‌లో చాలామంది వర్కర్స్ రోజువారీ పనుల్లో సగటున 91 నిమిషాల ఫ్రీ టైమ్‌ను మాత్రమే తీసుకుంటున్నారని సర్వే పేర్కొన్నది. అదనంగా 41 శాతం మంది తమ ఫోన్‌లలో ఏకకాలంలో స్క్రోలింగ్ చేస్తూ టీవీని చూస్తుంటారట. ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. దాదాపు 9 శాతం మంది ఏదైనా వెకేషన్‌ప్లాన్ ఎంచుకున్నప్పుడు కూడా వర్కుతో కనెక్ట్ అయ్యే ప్లేస్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు చెప్తున్నారు. 1928 నుంచి 1945 మధ్య జన్మించిన ‘సైలెంట్’ జనరేషన్‌లో ఇటువంటి పరిస్థితి చాలా అరుదు.
ఇక 1965 నుంచి 1980 మధ్య జన్మించిన (Gen X)వారిలో కేవలం 12 శాతం మంది మాత్రమే డైలీ వర్కులో అఫీషియల్ టైమ్‌కు ముందు వర్క్, ఇమెయిల్స్‌ను చెక్ చేయడం, రివ్యూ చేయడం చేస్తుంటారు. కాలక్రమేణా ప్రజలు తమ జీవితంలో నిరంతరం పరుగెత్తుతున్నట్లు అనిపిస్తుందని, అయితే ఇది స్థిరంగా ఉండదని నిపుణులు అంటున్నారు. అదే సందర్భంలో లాక్ ఆఫ్ స్లీప్, వర్క్ స్ట్రెస్, లిమిటెడ్ రిలాక్సేషన్ వంటి ప్రాబ్లమ్స్ కూడా మిలీనియల్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి వారికి స్టెప్ బ్యాక్, డీప్ బ్రీతింగ్, స్టిల్‌నెస్ మూమెంట్స్‌ను ఆస్వాదించడం వంటి మానసిక ఉల్లాసాన్ని ప్రోత్సహించే యాక్టివిటీస్ అవసరమని నిపుణుడు హెన్రీ నెల్సన్ పేర్కొంటున్నాడు.