ఆ హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు..

by Sumithra |
ఆ హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

భూమి విషయంలో తలెత్తిన గొడవల్లో ఒకరు దారుణంగా హత్యగావింపబడ్డారు. ఆ కేసుపై కొన్నేళ్లుగా వాదోపవాదాలు జరిగాయి. చివరగా ఆ హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి నల్గొండ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జీవిత ఖైదు విధించారు.

వివరాల్లోకివెళితే.. 2017 జులై 7న జీకే.అన్నారంలో భూ తగాదాలతో చిర్ర మహేందర్ రెడ్డిని నలుగురు వ్యక్తులు హత్య చేశారు. ఆ కేసులో తుది తీర్పును మంగళవారం కోర్టు వెలువరించింది. నిందితులు చిర్ర సైదిరెడ్డి, కంచరకుంట సైదిరెడ్డిలకు జీవిత ఖైదుతో పాటు రూ.5లక్షల జరిమానా విధించగా.. ఎల్ల సతీష్ రెడ్డి, భోదనపు వెంకట్ రెడ్డిలకు జీవిత ఖైదుతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది.

Advertisement

Next Story