- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అక్రమ సంబంధమే ఆయువు తీసింది

దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: అక్రమ సంబంధమే ఓ వ్యక్తి నిండు జీవితాన్ని బలి తీసుకున్న సంఘటన జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నేలపోగుల లో మంగళవారం వెలుగు చూసింది. మృతుడి భార్య, పోలీసుల కథనం ప్రకారం… నేలపోగుల గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ ఐలయ్య(55) అదే గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ భాగ్య అనే మహిళతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ విషయమై పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా ఇద్దరిలో మార్పు రాలేదు.
సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఐలయ్య అర్ధరాత్రి తర్వాత రోడ్డుపై విగతజీవిగా మారాడు. ఇరుగుపొరుగు అందించిన సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ఐలయ్య పై దాడి చేసి పథకం ప్రకారం హత్య చేసినట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మృతుడి భార్య ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.