ఎల్ఐసీ పాలసీదారులకు ఊరట!

by Harish |
ఎల్ఐసీ పాలసీదారులకు ఊరట!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పాలసీదారులు తమ మెచ్యూరిటీ క్లెయిమ్ పత్రాలను ఈ నెల చివరి వరకూ దేశంలో ఎక్కడైనా సమర్పించేందుకు అనుమతిచ్చింది. సమీప ఎల్ఐసీ కార్యాలయాల్లో ఎక్కడైనా సరే మార్చి 31 వరకు అందజేసేందుకు వీలుటుందని ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా తమ పాలసీదారులు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించేందుకు పాలసీ పరిష్కార ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్న ఓ ప్రకటనలో తెలిపింది.

పాలసీ తీసుకున్న హోమ్ బ్రాంచ్‌తో సంబంధం లేకుండా మెచ్యూరిటీ చెల్లింపుల కోసం పాలసీదారులు దేశీయంగా 113 ఎల్ఐసీ డివిజనల్ ఆఫీసులు, 2048 శాఖలు, 1,526 ఉప కార్యాలయాలు, 74 కస్టమర్ జోన్‌లలో తమ మెచ్యూరిటీ క్లెయిమ్ పత్రాలను జమ చేయవచ్చని స్పష్టం చేసింది. నిజానికి క్లెయిమ్ ప్రక్రియను హోమ్ బ్రాంచ్ నుంచే చేయాలి, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ఐసీ దేశవ్యాప్తంగా ఉన్న తన నెట్‌వర్క్ నుంచి పత్రాలను డిజిటల్‌గా బదిలీ చేసుకోనుంది.

Advertisement

Next Story