- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఓ నిర్వహణకు నవంబర్‌లో దరఖాస్తు చేయనున్న ఎల్ఐసీ సంస్థ
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. నవంబర్ నెలలో ఐపీఓ కోసం స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ పత్రాలను సమర్పించనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఎల్ఐసీ ఐపీఓను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే నెలలో సెబీకి డ్రాఫ్ట్ పత్రాలను అందించేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఎల్ఐసీ సంస్థకు చెందిన నిబంధనల్లో కీలక మార్పులు చేశారు. లిస్టింగ్ నిబంధనలను అనుసరిస్తూ సంస్థ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించనున్నారు. ఎల్ఐసీ చైర్మన్ పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62కు పెంచారు. ఇటీవల ఐపీఓ నిర్వహణ కోసం 10 మర్చంట్ బ్యాంకులను ఎంపిక చేసింది. గత నెలలో సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్‌ను న్యాయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. అలాగే, విదేశీ పెట్టుబడిదారులకు ఎల్ఐసీ ఐపీలో పాల్గొనే అనుమతులపై చర్చలు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని నిర్ధేశించినట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా రూ. 10 ముఖ విలువతో రూ. 25 వేల కోట్ల విలువైన షేర్లను ఎల్ఐసీ విక్రయించనుంది.