‘గ్యాస్ బాధిత గ్రామాలను ఆదుకుంటాం’

by srinivas |   ( Updated:2020-05-14 08:43:56.0  )
‘గ్యాస్ బాధిత గ్రామాలను ఆదుకుంటాం’
X

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ఆ సంస్థ మరోసారి ప్రకటన విడుదల చేసింది. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు ఎనిమిది మందితో కూడిన బృందం దక్షిణకొరియా రాజధాని సియోల్ నుంచి వచ్చిందని తెలిపింది. ప్రమాద కారణాలతో పాటు, పర్యావరణ అంశాలపై కూడా ఈ బృందం పూర్తి స్థాయిలో విశ్లేషిస్తుందని ప్రకటనలో పేర్కొంది. ప్రమాదం అనంతరం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్టిరిన్ లిక్విడ్‌ను దక్షిణ కొరియాకు తరలించే ఏర్పాట్లు చేశామని చెప్పింది.

గ్యాస్ లీకేజీ బారిన పడిన గ్రామాలను ఆదుకునేందుకు ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేస్తామని తెలిపింది. స్టైరిన్ బారిన పడిన వారందరికీ ఆహారం, వైద్య సౌకర్యాలను అందిస్తామని ప్రకటించింది. ప్రజల వైద్య పరీక్షల కోసం సురక్ష ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది. బాధిత గ్రామాల్లో భవిష్యత్తు పరిణామాలు, ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక సంస్థతో సర్వే చేయిస్తామని ప్రకటించింది. బాధితులు 0891-2520884, 2520338 నంబర్లు లేదా [email protected]కు మెయిల్ చేయడం ద్వారా కూడా తమ సమస్యలు లేదా అభిప్రాయాలను వెల్లడించవచ్చని ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed