‘ఆత్మహత్యకు అనుమతి ఇవ్వండి’

దిశ, వెబ్‌డెస్క్: మేము సామూహిక ఆత్మహత్య చేసుకుంటాము.. మాకు అనుమతి ఇవ్వండి.. ఆత్మహత్యకు అనుమతి అడగడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.. ఏపీలో ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వర్గీయులు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురానికి చెందిన వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏడాది కాలంగా తమ కుటుంబం పై వేధింపులు చేశారని వెంకటేశ్వరరావు వాపోయారు. ఆస్తుల్ని లాక్కుని స్వేచ్ఛను హరిస్తున్నారని.. ఈ విషయం పై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వారి వేధింపులతో సమాజంలో బతకలేమని.. అందుకే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని వెంకటేశ్వరరావు ఏపీ గవర్నర్, హైకోర్టుకు లేఖ రాశారు. అయితే, ఈ వ్యవహారం పై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఖండించారు. ఆ కుటుంబం తన పై చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పడం గమనార్హం.

Advertisement