- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సరిహద్దులో ‘చిరుత, పులి’ గాండ్రింపులు..
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెన్ గంగ తీరంలో పులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఇరు రాష్ట్రాల రైతాంగాన్ని ఈ పరిణామాలు కలవరపెడుతున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రం నుంచి తప్పించుకున్న పులులు ఇటీవల ఆవు దూడను చంపేయడంతో రైతులు భయపడుతున్నారు.
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ :
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెన్ గంగ నదీ తీరంలో పులులు సంచరిస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల రైతులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రం నుంచి తప్పించుకున్న చిరుత కొద్ద రోజు క్రితం ఆవు దూడపై దాడి చేసి చంపేసింది. దీంతో పంట పొలాల వద్దకు వెళ్లాలంటేనే రైతులు జంకుతున్నారు.
ఇటు పెద్ద పులి…
తెలంగాణ, మహారాష్ట్ర నడుమ ఉన్న పెన్ గంగా నదికి ఇరువైపులా గత వారం రోజులుగా పులుల సంచారం పెరిగింది. మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం గొల్లఘాట్ గ్రామంలో ఉన్న వ్యవసాయ భూముల్లో పెద్దపులి సంచరించినట్లు రైతులు తెలిపారు.
నదీతీరంలోనివి పులి అడుగులేనని భావించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా పరిశీలించిన అనంతరం పులి సంచరిస్తున్నదని, అవి దాని అడుగులేనని ధ్రువీకరించారు. గతంలో ఇదే గ్రామ సమీపంలో ఆవు, దూడలను పెద్ద పులి చంపేసిందని, అప్పటినుంచి గ్రామస్తులు భయపడుతూనే ఉన్నారు. తాజాగా మళ్లీ పెద్ద పులి సంచారం గొల్ల ఘాట్ గ్రామస్తులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
అటు చిరుత పులి..
ఇదిలా ఉంటే పెన్ గంగకు అవతలివైపు మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో రెండు రోజులు గా చిరుత సంచరిస్తున్నది. అయితే మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రం నుంచి చిరుతలు పెన్ గంగ పరిసరాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ సరిహద్దు గ్రామం కోపామండి వ్యవసాయ భూముల్లో రైతులకు చిరుత కనిపించింది. సోమ, మంగళ వారాల్లో గ్రామ పొలిమేరలో అది ఆవు దూడను పులి వేటాడి చంపింది.
దానికి గుర్తించిన రైతులు కర్రలతో చిరుత పులిని వెంటాడారు. దీంతో పెన్ గంగ నది గుండా చిరుత పులి పలాయనం చిత్తగించింది. అయితే మళ్లీ చిరుత ఎప్పుడ దాడి చేస్తుందోనని భయంతోప్రజలు హడలిపోతున్నారు. ఇరువైపులా పులుల సంచారం రెండు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.