తిరుమలలో వారిపై చిరుత దాడి

by Anukaran |
తిరుమలలో వారిపై చిరుత దాడి
X

దిశ, వెబ్ డెస్క్: వాహనదారులపై చిరుతపులి దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుమలలోని రెండవ ఘాట్ రోడ్డులోని అలిపిరి 4వ కి.మీ మలుపు వద్ద పలువురు వాహనదారులపై మంగళవారం చిరుతపులి దాడి చేసింది. దీంతో వారంతా అప్రమత్తమై దాని నుంచి తప్పించుకున్నారు.

అనంతరం వారంతా భయబ్రాంతులకు గురవుతూ విషయాన్ని టీటీడీకి తెలియజేశారు. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ ఘటనాస్థలానికి పెట్రోలింగ్ వాహనాన్ని పంపించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed