- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి లీగల్ నోటీసు
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఠాగూర్ లీగల్ నోటీసు పంపారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకానికి రూ.25 కోట్లు వసూలు చేశారని జూలై 3న సుధీర్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ఎలాంటి ఆధారాలు ఉన్నాయని సుధీర్‌రెడ్డిని ఠాగూర్ నోటీసులో ప్రశ్నించారు. తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేశారని, సుధీర్‌రెడ్డి ఆరోపణలతో మాణిక్క ఠాగూర్ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిందని ఠాగూర్తరుపున న్యాయవాది రవీంద్రన్ నోటీసులో పేర్కొన్నారు. రాతపూర్వకంగా వారంరోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రూ. కోటికి పరువు నష్టం దావా వేస్తామని ఠాగూర్ తరపు లాయర్ తెలిపారు.
Next Story