వేతనాల తగ్గింపుపై 'సీఎంకు వామపక్షాల లేఖ'

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో :
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్పొరేషన్ కార్మిక ఉద్యోగులకు సగం వేతనం ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవలని డిమాండ్ చేస్తూ.. వామపక్ష పార్టీలు మంగళవారం సీఎం కేసీఆర్‌‌కు లేఖ రాశాయి. వామపక్షాల పార్టీలు అఖిలపక్ష సమావేశంలో చర్చించిన పలు అంశాలను సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించారు. ఉద్యోగులకు ప్రభుత్వం సగం జీతం ఇచ్చినట్లైతే ఆ ప్రభావం ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులపైనా పడుతుందని తెలిపారు. ఓ వైపు లాక్‌డౌన్ కాలంలో అందరికి పూర్తి వేతనాలు ఇవ్వాలని ప్రైవేట్ రంగంతో పాటు వ్యాపార సంస్థలకు విజ్ఞప్తి చేసి, మరోవైపు ప్రభుత్వమే సగం జీతాల్లో కోత విధిస్తామంటే.. ప్రైవేటు రంగాలు కూడా అదే బాటలో పయనించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

జీతాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 27 ప్రకారం వైద్య, ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీస్ డిపార్టుమెంట్ వారికి సైతం సగం జీతాలే వస్తాయన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వారికీ సగం జీతాలే ఇవ్వడం సమంజసం కాదని తెలిపారు. నెలవారీ వేతనాలపై ఆధారపడే ఉద్యోగుల పట్ల ఈ పద్ధతిలో వ్యవహరించడం విరమించుకోవాలని.. ఈ విపత్కర పరిస్థితుల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని వామపక్షాలు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ పేర్కొన్నాయి.

Tags: Salaries reduction, Lock down, Left parties, All party meeting



Next Story

Most Viewed