- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమ్యూనిస్టులు ‘కారు’తో కలిశారా..?
దిశ ప్రతినిధి, ఖమ్మం: హోరాహరీగా సాగిన మండలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయారు. తమ కంచుకోటలుగా భావించే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో కనీసం పోటీ ఇవ్వలేక చతికిలపడ్డారు. సుమారు లక్ష ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుస్తానన్న అభ్యర్థి.. కనీసం పోటీ ఇవ్వకపోవడానికి కారణమేమిటి..?, వస్తాయని భావించిన ఓట్లు ఎక్కడికి వెళ్లినట్లు అనే చర్చ రాజకీయ వర్గాల్లో విసృతంగా సాగుతోంది. ఈ సెగ్మెంట్ లో కమ్యూనిస్టు పార్టీలకు సంప్రదాయ ఓటుబ్యాంకు ఉంది. వామపక్షాల అభ్యర్థిగా పోటీచేసిన జయసారథిరెడ్డి కనీసం స్వతంత్ర అభ్యర్థి స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయారు.
క్షేత్రస్థాయిలో కేడర్ లేక బీజేపీ, నాయకత్వ లేమితో కాంగ్రెస్ అధికార పార్టీ అభ్యర్థిని ఢీకొట్ట లేకపోయారు. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, టీజేఎస్ అభ్యర్థి కోదండరాం టీఆర్ఎస్ కు చివరిదాకా ముచ్చెమటలు పట్టించారు. జయసారథిరెడ్డి మహబూబాబాద్ వాసి.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే. జర్నలిస్టుగా అందరికీ సుపరిచితులే. ఆయనకు కేవలం 9,577 ఓట్లు మాత్రమే మొదటి ప్రయారిటీలో పడ్డాయి. సెగ్మెంట్ లో మొత్తం 4.90లక్షలపై చిలుకు పట్టభద్రుల ఓట్లు ఉండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 1.26 లక్షలకుపైగా ఓట్లు ఉన్నాయి.
వీటిలో ఎంతోకొంత వామపక్షాలకు సంప్రదాయ ఓటింగ్ ఉంటుంది. ఆ ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్ కు పడినట్లు తెలుస్తోంది. లెఫ్ట్ పార్టీకి చెందిన కొందరు పెద్దలే సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడి.. తమ ఓట్లు ఎలాగైనా సరే టీఆర్ఎస్ అభ్యర్థికి పడేలా చేయాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు భారీగానే ‘భవిష్యత్ ఒప్పందాలు’ జరిగాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అంతేకాదు అభ్యర్థుల గెలుపు బాధ్యతను జిల్లాల వారీగా మంత్రులకే అప్పజెప్పడం.. పల్లా గెలుపు ఎట్టిపరిస్థితుల్లోనూ అనివార్యమని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో పువ్వాడ అజయ్ సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం శ్రమించారు.
‘క్రాస్ ఓటింగ్’ వాస్తవమెంత?
భదాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉంటుంది. జిల్లా కేంద్రం కొత్తగూడెం సీపీఐ నేత కూనంనేని సాంబశివరావుకు మంచి పట్టున్నప్రాంతం. భద్రాచలం నియోజకవర్గంలో ఎంతో కొంత సీపీఎం కేడర్ అలాగే ఇప్పటికీ ఉంది. ఈ ప్రాంతంలోని ఓట్లు సైతం వామపక్ష పార్టీలు తమ అభ్యర్థికి వేయించలేకపోయాయి. కారు పార్టీనేతల ఎక్కడికక్కడ పలు పార్టీలకు చెందిన వారితో ములాఖత్ అయి ఒప్పందం మేరకు ఓట్లు బదిలీ అయినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో అధికారపార్టీ కార్యకర్తలు ఏకంగా పోలింగ్ బూత్ ల్లో సైతం డబ్బు పంచిన వీడియోలు పోలింగ్ రోజు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో వామపక్ష గ్రాడ్యుయేట్ల ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి బదిలీ అయినట్లు తెలుస్తోంది.
సీపీఐకి చెందిన జయసారథిరెడ్డి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందినవారు కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మంచి సంబంధాలు ఉన్నాయి. విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలకు సుపరిచితులు. జర్నలిస్టు సంఘాలపైనా నమ్మకం పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో మానుకోట ఘటనలో సీపీఐది ప్రముఖపాత్ర.. మరి సొంత జిల్లాలో 35వేల పైచిలుకు ఓట్లున్నా..ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. కొంతమంది వామపక్ష భావజాలం ఉన్న పట్టభద్రులు స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే కోదండరాం, తీన్మార్ మల్లన్నకు వేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది.
అగ్రనేతలు ప్రచారం చేసినా..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి విస్తృతంగా ప్రచారం చేసినా జయసారథిరెడ్డి కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. ఆయన అందరికంటే ముందు.. దాదాపు ఐదారు నెలల ముందుగానే ప్రచారం ప్రారంభించారు. ఎవరూ చేయని విధంగా గల్లీగల్లీ తిరిగారు. దాదాపు అన్ని మండల కేంద్రాల్లో పర్యటించి సుమారు వెయ్యి స్కూళ్లల్లో ప్రచారం చేశారు. కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు, ఉద్యోగులు, పట్టభద్రులు, విద్యార్థి సంఘాలు, యువజన నాయకులు ఇలా ప్రతిఒక్కరితోనూ ప్రత్యేక భేటీలు ఏర్పాటుచేసి ఓటర్లను నేరుగా కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. పార్టీ నాయకుల లోపాయికారీ ఒప్పందాల కారణంగానే ప్రశ్నించే గొంతుక జయసారథిరెడ్డి ఓడిపోయారనే చర్చ సాగుతోంది.