- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాద స్థితిలో ఎడమ కాలువ..!
దిశ, నాగార్జున సాగర్: లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే నాగార్జున సాగర్ ఎడమకాల్వ ప్రమాద స్థితికి చేరింది. కోట్ల రూపాయలు పెట్టి ఆధునికీకరణ చేసి పట్టుమని పదేళ్లైనా గడవకుండానే ప్రమాదంలో పడింది. గత నెలలో అనుముల మండలం చెక్పోస్ట్ వద్ద ఎడమకాల్వ లైనింగ్ దెబ్బ తిని కట్ట పెద్ద ఎత్తున కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కట్ట దెబ్బతిన్న ప్రాంతంలో ఇసుక బస్తాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ఉండడంతో పూర్తి స్థాయి పనులు చేయలేదు.
సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్న సుమారు పది లక్షల ఎకరాలకు వానాకాలం పంటకు నీరు అందించాల్సి ఉంది. లక్షల ఎకరాలకు నీటిని అందించాలంటే ఎడమకాలువలో నిత్యం సుమారు 11 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి. ఈ నీటి ప్రవాహానికి ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఇసుక బస్తాలు ఏమేర నిలుస్తాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడమ కాలువపై సంబంధిత అధికారులు నిత్య పర్యవేక్షణ చేస్తూ ఈ వానాకాలం పంట చేతికి వచ్చే వరకు దెబ్బ తినకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.