- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జమ్మికుంటలో దారుణం.. ఆ శబ్ధం విని భయపడిన లెక్చరర్ మృతి

దిశ, వెబ్‌డెస్క్ : కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులకు భయపడి ఓ లెక్చరర్ పారిపోతూ.. బావిలో పడి మృతి చెందిన ఘటన జమ్మికుంటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. పొనుగంటి వేణు అనే యువకుడు ఓ ప్రైవేట్ కాలేజీలో విధులు నిర్వహిస్తూ.. జమ్మికుంట పట్టణంలోనే నివసిస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి సరదగా స్నేహితులతో కలిసి తిరిగిన అతను, రాత్రి సమయంలో హుజురాబాద్ రోడ్‌లో గల అభిరామ్ బార్ ఎదురుగా ఉన్న రోడ్డు దగ్గర స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. అయితే ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా పోలీసుల సైరన్ వినపడడంతో వారందరూ పారిపోవడం మొదలు పెట్టారు. ఆ సమయంలో దగ్గరిలో ఉన్న బావి గమనించని వేణు అందులో పడిపోయాడు. స్నేహితులు అతన్ని కాపాడటానికి ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతుడికి భార్య ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వేణు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.