గిరి పుత్రులకు ఆకులే మాస్క్‌లు

by Shyam |
గిరి పుత్రులకు ఆకులే మాస్క్‌లు
X

దిశ, వరంగల్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి నుంచి ప్రాణాలు దక్కించుకోవాలంటే పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు. ప్రధానంగా ముఖాలకు మాస్క్‌లు ధరించాలని వైద్యులు పదేపదే పేర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు ఏజెన్సీలో వింత పరిస్థితి నెలకొంది. పట్టణాలు, నగరాల్లో మాస్క్‌లు ధరించాలని చెబుతున్నప్పటికీ అక్కడి గిరిజనుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారనే‌ విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిపుత్రులు ప్రస్తుత పరిస్థితుల్లోనూ అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారనే‌ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా మాస్క్‌ల కోసం ప్రయత్నించినా.. ఫలితం లేకపోవడంతో చేసేది లేక గిరిపుత్రులు తమకు ప్రకృతి ప్రసాదించిన, అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించుకుని మాస్కులు తయారు చేసుకున్నారు. కేవలం పెద్దవారికే కాకుండా చిన్నారులకు సైతం ఆకుతో మాస్క్‌లను తయారు చేసి ముఖాలకు కట్టుకుంటున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీ, తాడ్వాయి, మంగపేట ఏజెన్సీలోని పలు గిరిజన గూడాల్లో గిరిపుత్రులు ఈ తరహా మాస్క్‌లతో దర్శనమిస్తూ మైదాన ప్రాంతాల్లోని జనాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags : Factories, Nalgonda, ongoing projects, workers from other states, Corona, Lock down

Advertisement

Next Story

Most Viewed