‘అసలు వాళ్లు ఉన్నారని… ముఖ్యమంత్రికి గుర్తుందా’

by  |
‘అసలు వాళ్లు ఉన్నారని… ముఖ్యమంత్రికి గుర్తుందా’
X

దిశ, సంగారెడ్డి: రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్లమీద తిరుగుతుంటే… సీఎం కేసీఆర్ కనీసం స్పందించకపోవడం మరీ దారుణం అని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం(టీజీఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షులు దొడ్ల వెంకట్ విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ… కరోనా ప్రభావం వల్ల ఎంతో మంది ప్రైవేట్ టీచర్స్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

అసలు ఇంతకీ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారన్న సంగతి ముఖ్యమంత్రికి గుర్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు ఆరేండ్లు దాటినా ఇప్పటివరకూ కనీసం 50 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకపోవడం దారుణం అన్నారు. నిరుద్యోగులు ప్రతిరోజూ మానసిక ఆందోళనకు గురవువుతున్నారని, మరికొందరు ఉద్యోగాలు లేక పెళ్లిళ్లు చేసుకోకుండా, తాగుడుకు బానిసై చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.


Next Story