NTRకు భారతరత్న రాకుండా అడ్డుకున్నారు : లక్ష్మీపార్వతి

by Anukaran |
NTRకు భారతరత్న రాకుండా అడ్డుకున్నారు : లక్ష్మీపార్వతి
X

దిశ, వెబ్‌డెస్క్ : విశ్వవిఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్థంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్ చేశారు. తొలుత నివాళ్లు అర్పించిన ఆమె ఎన్టీయార్‌ కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు చేశారు. ఆయనకు భారతరత్న రాకుండా వారి సొంత కుటుంబ సభ్యులే అడ్డుపడ్డారని విమర్శించారు.

అధికారంలో ఉన్నప్పుడే కేంద్రంపై ఒత్తిడిచేస్తే ఎప్పుడో వచ్చేదని వ్యాఖ్యానించారు.ఎన్టీయార్‌కు భారతరత్న కోసం కేంద్రానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరతానని చెప్పారు. ఆయనకు భారతరత్న వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని లక్ష్మీపార్వతి స్పష్టంచేశారు.



Next Story

Most Viewed