- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గబ్బా టెస్టు గెలవగానే ఏడ్చిన లక్ష్మణ్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా చారిత్రిక విజయం సాధించిన రోజు దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఏడ్చాడట. ఒక క్రీడా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. క్రికెట్ చూస్తే తాను కంటతడి పెట్టింది రెండు సార్లు మాత్రమే. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన రోజు తొలి సారిగా ఏడ్చాను. ఆ తర్వాత పదేళ్లకు గబ్బా టెస్టులో టీమ్ ఇండియా విజయం సాధించిన వెంటనే కన్నీళ్లు వచ్చాయని లక్ష్మణ్ చెప్పాడు.
‘బ్రిస్బేట్ టెస్టు విజయం చాలా గొప్పది. నేను ఆ మ్యాచ్ చూస్తే భావోద్వేగానికి గురయ్యాను. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ ఆడుతున్న సమయంలో ఆందోళనకు గురయ్యాను. అయితే మ్యాచ్ గెలవగానే ఒక్కసారిగా ఏడ్చేశాను. ఆ రోజు నేను నా కుటుంబ సభ్యులతో కూర్చొని మ్యాచ్ చూస్తున్నాను. వాళ్లు కూడా నన్ను చూసి భావోద్వేగానికి గురయ్యారు’ అని లక్ష్మణ్ చెప్పాడు. కంగారూలపై ఆస్ట్రేలియా గడ్డమీద గెలవాలనేది నా కల.. కానీ ఆ కల తీరలేదు. అయితే కుర్రాళ్లు మాత్రం ఆ ఘనతను సాధించారు. అందుకే ఆ రోజు అలా ఏడ్చాను. వాస్తవానికి అవి ఆనందభాష్పాలు అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.