వీడియో ద్వారా బ్యాంకు అకౌంట్ ఓపెన్

by Harish |
వీడియో ద్వారా బ్యాంకు అకౌంట్ ఓపెన్
X

దిశ, సెంట్రల్ డెస్క్: మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్తగా బ్యాంకు ఖాతాను తెరవాలనుకునే వారికోసం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకనుంచి బ్యాంకులకు నేరుగా వెళ్లి ఖాతాను తెరవాల్సిన పని లేకుండా వీడియో ద్వారా కేవైసీని సమర్పించే అవకాశాన్ని వినియోగదారులకు కలిగిస్తోంది. బ్యాంకు ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలను ఇవ్వాల్సిన పనిలేదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రాని కారణంగా ఈ సదుపాయాన్ని తెచ్చామని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ‘ఈ కొత్త విధానంతో వినియోగదారులు నేరుగా బ్యాంకుకు వచ్చి ఖాతా తెరవాల్సిన అవసరంలేదు. ఖాతా తెరిచేందుకు బ్యాంకు అధికారులను కలవాల్సిన అవసరం కూడా లేదు’ అని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు రిటైల్ హెడ్ అమిత్ కుమార్ వివరించారు. ఈ సదుపాయం ద్వారా ఖాతా ఓపెన్ చేసిన వారికి 7 శాతం వడ్డీ అందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌బీఐ మంజూరు చేసిన వీడియో ఆధారిత కేవైసీ ప్రక్రియ ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్ పొదుపు ఖాతా తెరిచేందుకు మినిమమ్ బ్యాలెన్స్ మేయింటెయిన్ చేయాల్సిన అవసరంలేదని బ్యాంకు వెల్లడించింది. వినియోగదారులు లావాదేవీల కోసం ఎక్కువగా డిజిటల్ విధానాన్ని అనుసరిస్తున్నందునే ఈ విధానం తెచ్చామని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed