- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ, మహబూబ్‌నగర్: ఇష్టానుసారంగా రోడ్లపైకి చిన్నచిన్న కారణాలతో వచ్చే వారు, ఇకపై అలా వస్తే చిక్కులు తప్పవు. ఇంతవరకూ పోలీసులు కొంత చూసిచూడనట్టుగా వ్యవహరించినా ఇకమీదట ఆ పరిస్థితి ఉండదని పోలీసులు అంటున్నారు. ఇకపై రూల్స్‌కు వ్యతిరేకంగా ఎవరైనా బైకులు, కార్లపై 3 కిలోమీటర్లకు మించి తిరిగితే వెంటనే సిటిజన్ ట్రాకింగ్ కొవిడ్-19 యాప్‌లో కేసు నమోదు చేస్తారు. ఇవాళ్టి నుంచి ఈ యాప్ అమల్లోకి వచ్చింది. ఈ యాప్‌లో సదరు బండి ఎంత దూరం వెళ్లింది, రోజు ఎన్ని కిలోమీటర్లు అదనంగా వెళ్లింది అనేది ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. దీంతో యాప్‌లో చెక్ చేసి మరీ కేసులు రాయడం జరుగుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇకపై ఎవరైనా రోడ్లపై వాహనాలతో ఎంటరైతే సిటిజన్ ట్రాకింగ్ యాప్‌లో ఆ వాహనం నెంబర్ ఎంటర్ చేస్తారు. అలా ఆ బండి వెళ్తున్న చోట్ల వేర్వేరు ప్రాంతాల్లో దాని నెంబర్ ఎంటరవుతూ ఉంటుందని వివరించారు. అది 3 కిలోమీటర్లు దాటిందంటే చాలు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలు తమకు కావాల్సిన సరుకులే కావాలని పట్టుబడితే చిక్కులు తప్పవు. కేవలం మందుల విషయంలో మాత్రం కొంత వెసులుబాటు ఉంటుంది. ఆ మందు 3 కిలోమీటర్ల పరిధిలో దొరకకపోతే, అప్పుడు పోలీసులకు విషయం చెప్పి వారి అనుమతితో చుట్టుపక్కల వేరే మెడికల్ షాపులకు వెళ్లొచ్చు.
Tags: Launch, Citizen Tracking App, Mahabubnagar, lockdown, 3 km, police