చండూర్‌లో ముగ్గురికి కరోనా

by Shyam |
చండూర్‌లో ముగ్గురికి కరోనా
X

దిశ, మునుగోడు: చండూరు మండలంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. తాజాగా చండూరులో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఎస్ఐ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధిత వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలన్నారు.

Advertisement

Next Story