'ఆర్‌ఆర్‌ఆర్‌ 2' పై క్రేజీ అప్‌ డేట్‌ ఇచ్చిన రైటర్‌ విజయేంద్రప్రసాద్‌..

by Shiva |   ( Updated:2023-03-13 15:02:02.0  )
ఆర్‌ఆర్‌ఆర్‌ 2 పై క్రేజీ అప్‌ డేట్‌ ఇచ్చిన రైటర్‌ విజయేంద్రప్రసాద్‌..
X

దిశ, వెబ్ డెస్క్: 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి ఆస్కార్‌ రావడం పట్ల రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓ సగటు భారతీయులు గర్వపడినట్టుగానే తాను గర్వపడుతున్నానని తెలిపారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో ఆస్కార్‌ సాకారం చేసిన రాజమౌళికి ఫాదర్‌ అయినందుకు, ఆయన తనకు కుమారుడు అయినందుకు ఓ తండ్రిగా గర్వపడుతున్నానని, అత్యంత సంతోషకరమైన సందర్భం అని అన్నారు. ఆస్కార్‌ ప్రకటించే సమయంలో అందరిలాగే తాను ఎగ్జైట్‌ అయినట్లు ఆయన తెలిపారు.

తాజాగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' లోని 'నాటునాటు'పాటకి ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ దక్కిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్‌ సినిమా చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా ప్రపంచానికి తెలిసేలా చేసింది 'నాటునాటు'. ఈ సినిమాకి పునాది వేశారు విజయేంద్రప్రసాద్‌. ఆయన మదిలో పుట్టిన కథే 'ఆర్‌ఆర్‌ఆర్‌' అనే విషయం తెలిసిందే. ఆస్కార్‌ వచ్చినప్పుడు తాను ఎంతో హ్యాపీగా ఫీలైనట్లు ఆయ తెలిపారు.

తాజాగా ఆయనతో ఓ మీడియా సంస్థ ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆస్కార్‌ తనపై బాధ్యత పెంచిందన్నారు. మున్ముందు మరిన్ని మంచి కథలు రాసేందుకు ప్రోత్సాన్నిచ్చిందన్నారు. రచయితని గౌరవిస్తే ఇలాంటి ఫలితాలే ఉంటాయన్నారు.

ఇందులో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సీక్వెల్‌పై స్పందించారు విజయేంద్రప్రసాద్. 'ఆర్‌ఆర్‌ఆర్‌'అభిమానులకు క్రేజీ అప్‌ డేట్‌ ఇచ్చారు. ఇంతకు మించి 'ఆర్‌ఆర్‌ఆర్‌2' ఉండబోతుందన్నారు. ఇదే కథకి కొనసాగింపుగా కథ ఉంటుంది, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తారని వెల్లడించారు. ఇదే కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నామని, ఆ వివరాలు మున్ముందు వెల్లడిస్తామని తెలిపారు. ఇంతకు మించి దీనిపై ఇప్పుడు తాను స్పందించలేనన్నారు.

ఈ సందర్భంగా మహేష్‌బాబుతో రాజమౌళి చేయబోయే సినిమా గురించి చెప్పారు. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో అంతర్జాతీయంగా ఈ సినిమా ఉంటుందన్నారు. అయితే అంతర్జాతీయంగా అంటే అదేదో కాదని, మనవైన ఎమోషన్స్, మనవైన కథలే ఉంటాయన్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అంతర్జాతీయ అంశాలేవి లేవని, కథ బాగుండాలని, కథ బాగుంటే చూస్తారని, ఆ కథ, ఆ ఎమోషన్‌ నచ్చిందని, హృదయాన్ని హత్తుకుందని, అందుకే ఇంతగా ఆదరించారని, దానికి భాషతో సంబంధం లేదన్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు సినిమా వర్క్ జరుగుతుందన్నారు.


ఇవి కూడా చదవండి :

ఆర్ఆర్ఆ‌ర్‌కు ఆస్కార్ దక్షిణాదికి గర్వకారణం: సౌత్ సేన

Advertisement

Next Story