- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్యునిలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న కొత్త వేవ్.. శాస్త్రవేత్తలకు చెమటలు..?!
దిశ, వెబ్‌డెస్క్ః న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబికి చెందిన సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ పరిశోధకులు సూర్యునిలో ఇంతకుముందు గుర్తించని కొత్త తరంగాలను ఇటీవలే కనుగొన్నారు. ఇది ఇప్పటి వరకూ ఉన్న సిద్ధాంతానికి మించి, ఊహించిన దాని కంటే చాలా వేగంగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో ప్రచురించిన "సూర్యుడిలో అధిక-ఫ్రీక్వెన్సీ-రెట్రోగ్రేడ్ వోర్టిసిటీ వేవ్స్ డిస్కవరీ" అనే అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ స్టడీలో రీసెర్చ్ అసోసియేట్ క్రిస్ ఎస్.హాన్సన్ నేతృత్వంలోని పరిశోధకులు దీనికి సంబంధించి, 25 సంవత్సరాల డాటాను ఎలా విశ్లేషించారో వివరంగా చెప్పారు. ఈ తరంగాలను గుర్తించడానికి. సూర్యుని భ్రమణానికి వ్యతిరేక దిశలో కదిలే హై-ఫ్రీక్వెన్సీ రెట్రోగ్రేడ్ (HFR) తరంగాలు, సూర్యుని ఉపరితలంపై సుడిగుండాలు (స్విర్లింగ్ మోషన్స్) నమూనాగా కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుత సిద్ధాంతంలో ఊహించిన దానికంటే మూడు రెట్లు వేగంతో కదులుతున్నట్లు చెప్పారు.
ఈ కొత్త HFR తరంగాలు నక్షత్రాల గురించి మన అవగాహనలో ఉన్నదాని కంటే ఇంకా ముఖ్యమైన ప్రశ్నలను రేకెత్తిస్తాయని అన్నారు. ఇతర ప్రసిద్ధ తరంగాలు, అయస్కాంతత్వం, గురుత్వాకర్షణ లేదా ఉష్ణప్రసరణల మధ్య సంక్లిష్ట పరస్పర చర్యలు HFR తరంగాలను ఈ వేగంతో నడిపించే అవకాశం ఉందని, "ఈ మూడు ప్రక్రియలలో దేనికైనా HFR తరంగాలను ఆపాదించగలిగితే, సూర్యుని గురించి మనకు ఇప్పటికీ ఉన్న కొన్ని బహిరంగ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది" అని హాన్సన్ పేర్కొన్నారు. అయితే, కొత్తగా కనిపించిన ఈ తరంగాల వల్ల సౌరకుటుంబంలోని భూగ్రహంపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న విషయాన్ని పరిశోధిస్తున్నారు.