8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇలా..

by Shiva |   ( Updated:2023-04-06 04:23:23.0  )
8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇలా..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాన నరేంద్ర మోదీ 8న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూలు ఖరారైంది. 8న ఉదయం 11.30 గంటలకు మోదీ ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లనున్నారు.

అక్కడ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. అనంతరం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 12.18 గంటల నుంచి 1.20 గంటల వరకు అక్కడ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొని 1.30 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

Read more:

మొన్న బీఎల్.. నేడు బండి.. కీలక నేతలే బీఆర్ఎస్ టార్గెట్

పోలీసుల విచారణకు ముందే ఫిక్స్ చేసేశారు

Advertisement

Next Story