స్మార్ట్‌ఫోన్‌‌లో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ ఫోన్ హ్యాకింగ్ అయినట్లే!

by Anjali |   ( Updated:2023-05-10 05:37:53.0  )
స్మార్ట్‌ఫోన్‌‌లో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ ఫోన్ హ్యాకింగ్ అయినట్లే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైపోయింది. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర్నుంచి మొదలు పెడితే రాత్రి నిద్రపోయేంత వరకు జనాలు ఫోన్‌తో గడిపేస్తున్నారు. అయితే కొంతమంది పర్సనల్ సమాచారాన్ని కూడా ఫోన్‌లోనే సేవ్ చేసుకుని పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల మీ స్మార్ట్ మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డేటా భద్రంగా ఉండాలన్నా, హ్యాకింగ్‌కు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలన్నా యాప్స్‌ను కేవలం గూగుల్ ప్లే స్టోర్‌లోనే ఇన్‌స్టాల్ చేయాలి.

అన్ అఫీషీయల్ సోర్స్‌లు, థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేయకూడదు. వేరే సోర్స్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌లో మాల్‌వేర్, స్పైవేర్ ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత డేటాను, ముఖ్యంగా బ్యాంకింగ్ పాస్వర్డ్‌లను హ్యాకర్లు దోచేసే అవకాశం ఉంది. అందుకే కేవలం గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోండి.

Advertisement

Next Story

Most Viewed