- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హోంవర్క్ పనిష్మెంట్ తప్పించుకునేందుకు విద్యార్థి కిడ్నాప్ డ్రామా.. ఏం జరిగిందంటే..?
దిశ, వెబ్ డెస్క్ : హోంవర్క్ పనిష్మెంట్ తప్పించుకునేందుకు ఓ విద్యార్థి కిడ్నాప్ డ్రామా ఆడిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ లోని కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బిలాస్ పూర్ కు చెందిన ఓ విద్యార్థి డైలీ పాఠశాలలో ఇచ్చే హోం వర్క్ పూర్తి చేయలేదు. దీంతో ఎలాగైన మరుసటి రోజు టీచర్ చేతిలో పనిష్మెంట్ తప్పించుకోవాలని ఆ బాలుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు.
ఇద్దరు ముసుగు ధరించిన యువకులు తన వద్దకు వచ్చి ఓ మత్తు పదార్థాన్ని తన ముక్కపై ఉంచి స్పృహ కోల్పోయేలా చేశారని బాలుడు తన తల్లిదండ్రులకు తెలిపాడు. అనంతరం బైక్ పై తనను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని, ట్రాఫిక్ జామ్‌లో బైక్ ఆగిపోయిన సమయంలో తనకు అకస్మాత్తుగా స్పృహ వచ్చిందని ఆ బాలుడు తెలిపాడు. ఇక కిడ్నాపర్‌ల బారి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పరారైనట్లుగా డ్రామా క్రియేట్ చేశాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు కోట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించగా.. అదంతా ఓ కట్టుకథ అని తేలింది. అక్కడే ఉన్న బాలుడిని గట్టిగా ప్రశ్నించగా.. తాను హోంవర్క్ చేయలేదని, ఆ పనిష్మెంట్ ను తప్పించుకునేందుకే కిడ్నాప్ డ్రామా ఆడినట్లగా బాలుడు ఒప్పుకున్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.