కానిస్టేబుళ్ల పదోన్నతి సంతృప్తినిచ్చింది

by  |
కానిస్టేబుళ్ల పదోన్నతి సంతృప్తినిచ్చింది
X

దిశ ప్రతినిధి, వరంగల్: సుధీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న 133 మంది ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించడం అత్యంత ఆత్మసంతృప్తి కలిగించిందని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ తెలిపారు. నేడు పదవీ విరమణ చేస్తున్న పోలీస్ కమిషనర్‌కు ఆర్ముడ్ రిజర్వ్ విభాగం ఆధ్వర్యంలో విదాయి పరేడ్ ను ( వీడ్కోలు పరేడ్ ) మంగళవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. ఈ పరేడ్ కు ముఖ్య అతిధి హజరైన కమిషనర్ ముందుగా సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ కమాండర్ శ్రీనివాసరావుతో కలిసి పరేడ్ ను పర్యవేక్షించారు. సాయుధ పోలీస్ అధికారులు కమిషనర్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వోద్యోగికి పదవీ విరమణ తప్పదన్నారు. ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం నుంచి చివరి మజిలీ వరకు మనం ఎంతవరకు భాధ్యతాయుతంగా పని చేశామో ఈ రోజున తృప్తి లేదా భాధ మిగులుతుందన్నారు. తాను వరంగల్ పోలీస్ కమిషనర్‌గా భాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆధికారులు, సిబ్బంది సహకారంతో అన్ని ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు‌ జరగకుండా ప్రశాంతంగా నిర్వహించగలిగామన్నారు. ఫలితంగా బెస్ట్ ఎలక్ట్రోరోల్ ప్రాక్టీసెస్ ఆవార్డును సాధించామన్నారు. తొలిసారి మేడారం జాతర సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయంగా కలగకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు. ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి వరంగల్ ఏవర్ విక్టోరియస్ పేరు నిలబెట్టాలన్నారు. అదేవిధంగా కరోనా వ్యాధిని దృష్టిలో పెట్టుకోని ప్రతి ఒక్కరూ పంచసూత్రాలను పాటిస్తూ జాగ్రత్తపడాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమములో వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీసీపీ భీంరావు, వెంకటలక్ష్మీ, మురళీధర్‌తో పాటు ఏసీపీలు, అర్ఐలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.‌



Next Story

Most Viewed