‘ఫ్రీ రేషన్‌’ ఎప్పటివరకో తెలుసా?

by Shamantha N |
‘ఫ్రీ రేషన్‌’ ఎప్పటివరకో తెలుసా?
X

న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ బుధవారం కీలక నిర్ణయాలను ఆమోదించింది. నవంబర్ దాకా ఉచిత రేషన్ అందించే పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనా పథకం పొడిగింపు నిర్ణయానికి కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడించారు. దీనితోపాటు ఈపీఎఫ్ కేటాయింపులనూ ఆగస్టు వరకు పొడిగించడానికి సమ్మతం తెలిపింది. దీని కింద యాజమన్యం, ఉద్యోగి కేటాయించే సొమ్మును కేంద్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ నిర్ణయం ద్వారా 3.67 లక్షల కంపెనీలు, 72.22 లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందునున్నారు.

ఉద్యోగులు ఎక్కువ జీతాన్ని(పీఎఫ్ కోత లేకుండా) ఇంటికి తీసుకెళ్లనున్నారని, కంపెనీలకు ఊరట కలుగనుందని జవడేకర్ తెలిపారు. అలాగే, పట్టణ పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కిందే అఫర్డేబుల్ రెంటల్ హౌజింగ్ కాంప్లెక్స్‌(ఏహెచ్‌ఆర్‌సీ)ను క్యాబినెట్ గుర్తించిందని వివరించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు ఏహెచ్‌ఆర్‌సీగా మార్చనున్నారని, తొలుత మూడు లక్షల మంది లబ్ది పొందుతారని తెలిపారు. ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో రూ. 12,450 కోట్లను ప్రవేశపెట్టడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని వెల్లడించారు. సెప్టెంబర్ వరకు మూడు ఎల్‌పీజీ సిలండర్‌లను సుమారు 7.4 మహిళలకు పొందే అవకాశాన్నీ కలుగజేయడానికి ఆమోదించినట్టు తెలిపారు. వ్యవసాయరంగంలో మౌలిక వసతులు, లాజిస్టిక్స్ అవసరాల కోసం ఒక లక్ష కోటి రూపాయల కేటాయింపునూ క్యాబినెట్ ఆమోదించిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.

Advertisement

Next Story