హరీశ్‌కు ఏమి ఇచ్చినా.. తక్కువేనంటా

by  |
హరీశ్‌కు ఏమి ఇచ్చినా.. తక్కువేనంటా
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కరోనా పరీక్ష విషయంలో మరో ముందడుగు వేసింది అని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గ్యాదారి పరమేశ్వర్ కార్యదర్శి కోమండ్ల విక్రమ్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట వైద్య కళాశాలకు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా (ICMR) ఇండియా కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ అనుమతి లభించడం సిద్దిపేట ప్రజలు, ఉద్యోగస్తులు అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం కృషి చేసిన హరీశ్ రావు కు ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేనిదన్నారు.

అదేవిధంగా సిద్దిపేట వైద్య కళాశాల సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులు తెలంగాణ రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేటలో చాలా మంది ఉద్యోగస్తులు కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్నారని, ఇంతకుముందు కరోనా వచ్చింది అంటే టెస్ట్ చేయడానికి హైదరాబాద్ వెళ్లి పరీక్ష చేయుచుకోవాల్సి ఉండేదని, లేదా సిద్దిపేటలో పరీక్ష కోసం నమూనాలు ఇచ్చిన కూడా ఫలితాల కోసం మూడు నాలుగు రోజుల వేచి చూడాల్సిన పరిస్తితి ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి సిద్దిపేటలో లేదన్నారు. కరోనా టెస్ట్ చేయడానికి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సిద్ధిపేట మొబైల్ బస్సు ఏర్పాటు సంతోషకరమన్నారు. సిద్ధిపేటలో ఎక్కడ ఏ గల్లిలో కూడా కరోనా లక్షణాలతో ఉన్న వారినందరినీ కూడా పరీక్షలు చేసి ఒకవేళ వ్యాధి తీవ్రత ఉంటే వారిని హాస్పిటల్లో చేర్పించి లేదంటే హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేయడానికి ఇది మేలు చేస్తుందన్నారు.



Next Story

Most Viewed