- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్ధిపేటలో ఓ వృద్ధుడి పరిస్థితి ఘోరం
దిశ, హుస్నాబాద్: నాడు కాయకష్టం చేసి.. ఏ లోటు రాకుండా అల్లారు ముద్దుగా పెంచిన ఆ తండ్రిని తనయులు గాలికొదిలేశారు. వివరాల్లోకి వెళితే సిద్ధిపేట జిల్లా కొహెడ మండలం శనిగరం గ్రామపరిధిలోని శంకర్ నరగ్కు చెందిన పొతు మల్లయ్య(78) అనే వృద్ధుడిని తన ముగ్గురు కుమారులు పోషణ, బాగోగులు చూసుకోవాల్సింది పోయి, తనకున్న ఆస్థినంతా కొడుకులు లాక్కొని ఏ ఒక్కరూ చేరదీయడం లేదని హుస్నాబాద్ ఆర్డీఓ జయచంద్రారెడ్డిని ఆశ్రయించాడు.
స్పందించిన ఆర్డీఓ జూన్ 16న వృద్ధుని స్వగ్రామానికి వెళ్లి కుమారులను పిలిపించి మాట్లాడినా కూడా వారు తన తండ్రిని తమ వెంట తీసుకెళ్లలేదు. దీంతో అదేరోజు ఆ వృద్ధుడిని పీడీ రాంగోపాల్ రెడ్డి, తహసీల్దార్ రుక్మిణీ, ఎస్సై రాజుకుమార్, ఆర్ఐ రమ్యశ్రీ అంకిరెడ్డిపల్లిలో ఉన్న వృద్ధాశ్రమానికి తరలించారు.
కొన్ని రోజులకైనా కొడుకుల్లో మార్పు వస్తుందేమోనని చూసిన అధికారులు వారిలో నేటికి మారలేదు. ప్రస్తుతం ఆ వృద్ధుడి సిద్ధిపేట ఆసుపత్రిలో చావు బ్రతులకు మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని కుమారులకు పలు మార్లు సమాచారం అందించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. తండ్రి ఆరోగ్య పరిస్థతి విషమిస్తున్నా ఆ కుమారులు మాత్రం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించకపోవడంతో అధికారులను, గ్రామస్తులను కలిచివేస్తోంది. దీంతో వృద్ధుడి కొడుకులు పోతు రవీందర్, పోతు జనార్ధన్, పోతు సుధాకర్ పై ఉన్న భూమి మొత్తాన్ని అన్ సైన్ చేసి తిరిగి వృద్ధులపై పట్టాలు చేయడమే కాకుండా ముగ్గురి కొడుకులపై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ రుక్మిణీ తెలిపారు.