- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ ఇలాఖాలో వీళ్లకు న్యాయం జరిగేనా ?
దిశ, సిద్ధిపేట: ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వేలూరు, చిన్న తిమ్మాపూర్ లకు చెందిన దళిత రైతులు బ్యాగరి నర్సిములు, చింతల వీరేశం కుటుంబాలను అదుకొవాలని దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్వర్యంలో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పి.శంకర్, మాలమహనాడు రాష్ట్ర సెక్రెటరీ జనరల్ కరికే శ్రీనివాసులు మాట్లాడుతూ.. ములుగు మండలం చిన్న తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతు చింతల వీరేశంకు చెందిన 20 గుంటల భూమి కొండ పోచమ్మ సాగర్ నుండి సంగారెడ్డి వరకు కాలువ నిర్మిస్తుండడంతో భయాందోళనతో అనుమానస్పదస్థితిలో మృతిచెందారన్నారు.
వర్గల్ మండలం వెలూర్ లో దళిత రైతు బ్యాగరి నర్సింలు ఆత్మహత్యకు కారకులైన సర్పంచ్, తహసీల్దారు, వీఆర్వోలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ పై కేసు నమోదు చేసినప్పటికీ నేటికీ అరెస్టు చేయలేదన్నారు. వీఆర్వో, తహసీల్దారుపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు చట్టం ప్రకారం రూ. 10 లక్షల అర్ధిక సాయం, 3 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని, బాధిత కుటుంబంలో ఒకరి ఉద్యోగం, పెన్షన్, నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పి.శంకర్, మాలమహనాడు , రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మెడి అంజయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు ర్యాకం శ్రీ రాములు, నాయకులు అల్లిబెల్లి నర్సింగ్ రావు, వెన్న రాజు, బుట్టి సత్యనారాయణ, సమాచార హక్కు కార్యకర్త రాచురి మల్లికార్జున్, యవజన నాయకులు క్రాంతి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.