- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మగ్గం నేసిన రాజనర్సు
by Shyam |

X
దిశ, సిద్ధిపేట: శ్రావణ పౌర్ణమి సందర్భంగా సిద్ధిపేట మార్కండేయ దేవాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజనర్సు మాట్లాడుతూ సిద్ధిపేటలో పద్మశాలిలు చేనేత కార్మికులు ఘనంగా సోదర భావంతో నిర్వహించుకునే పండుగ రాఖీ పౌర్ణమి పండుగ అని అన్నారు.
సభ్యులందరికీ సమాజం రక్షణగా ఉంటుందని, ఐకమత్యంగా ఉండి వృత్తి వ్యాపారాలలో అగ్రస్థానంలో పద్మశాలీలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఆయన కొద్ది సేపు మగ్గం నేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాసు, బుర మల్లేశం పద్మశాలి సంఘం అధ్యక్షులు రమేష్, చేర్యాల మల్లికార్జున్, పెద్ది అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Next Story