‘ఆ వ్యక్తి మృతికి కారణం మీరే!’

దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని హరిత నర్సింగ్ హోమ్ లో వైద్యం వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలలోకి వెళ్తే సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామానికి చెందిన శ్రీరామోజు యాదగిరి చారి(40) అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం హరిత నర్సింగ్ హోమ్ లో చేరాడు. నేడు అతను ఆస్పత్రిలో మృతిచెందాడు. దీంతో అతను వైద్యం వికటించే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ఎదుట వారంతా ఆందోళనకు దిగారు. కాగా సంబంధిత ఆసుపత్రి వైద్యుడు వెంకటేశం, సిబ్బంది పరారీలో ఉన్నట్లు సమాచారం.

Advertisement